Ileana: టాలీవుడ్ డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన ఇలియానా.. కారణం అదే..!

Ileana.. గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె నటనతో కంటే నడుముతోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అందం, అభినయం, నటన, నడుము ఒంపులతో కుర్ర కారు మనసు దోచిన ఈ గోవా ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపింది. దాదాపు 15 సంవత్సరాలపాటు హీరోయిన్గా రాణించిన ఈమె గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇటీవల పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ తండ్రి ఎవరో కూడా ఈ మధ్యనే పరిచయం చేసింది కూడా. అయితే ప్రస్తుతం మళ్ళీ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. అటు సినిమాలలో నటించకుండా.. బిడ్డతోనే సమయాన్ని గడుపుతున్నట్లు సమాచారం.

నడుముతోనే పాపులారిటీ దక్కించుకున్న ఇలియానా..

Ileana: Ileana gave a warning to Tollywood directors.. That's the reason..!
Ileana: Ileana gave a warning to Tollywood directors.. That’s the reason..!

దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమెకు ఇంత మంచి గుర్తింపు రావడానికి కారణం ఆమె నటనతో పాటు నడుము కూడా అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సన్న నడుము హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమెతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరూ కూడా ప్రధానంగా ఈమె నడుము పైన ఫోకస్ పెట్టేవారు. పోకిరి సినిమా మొదలుకొని దేవుడు చేసిన మనుషులు, జులాయ్, అమర్ అక్బర్ ఆంటోనీ వరకు అందరూ కూడా ప్రతి సినిమాలో ఈమె నడుముని ఎక్కువగా చూపించారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ అంతటా ఈ గోవా బ్యూటీ నడుము పైనే డిస్కషన్ జరిగేది.. అంతలా ఈమె నడుమును వర్ణిస్తూ కవితలు , ఎన్నో పాటలు కూడా వచ్చాయి.. అయితే ఎక్కువగా తన నడుముని ఫోకస్ చేయడంపై ఇలియానా ఎన్నోసార్లు అభ్యంతరం కూడా తెలిపింది.

నడుము విషయంలో డైరెక్టర్లకు వార్నింగ్..

ఒకరోజు తనతో సినిమాలు తీసిన డైరెక్టర్ మీద సీరియస్ అవుతూ .. నా శరీరంలో మరో పార్ట్ లేనట్టు.. ఎందుకు నా నడుముని చూపిస్తున్నారు.. ఇకపై నా నడుముని మీరు ఫోకస్ చేయకూడదు అంటూ కండిషన్తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదంతా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇలియానా పంచుకున్న మాటలు.. అయితే ఇవి మళ్లీ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ మాటలు విన్న అభిమానులు , నెటిజెన్స్ నీ నడుము వల్లే కదా నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సన్నని నడుముతో యువతకు గిలిగింతలు పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇలియానా కెరియర్..

ఎన్ .జె. భిక్షు, అరుణ భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న ఈమె. 2006లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.. ఈ సినిమాతో హీరో రామ్ కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. మొదటి పరిచయంతోనే వీరిద్దరూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఈ చిత్రంలో ఇద్దరి నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటుల అవార్డులు లభించాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఇక చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు