IIFA Utsavam 2024 : స్వీటీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఐఫాలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ కు బెస్ట్ డైలాగ్స్ అవార్డు

IIFA Utsavam 2024 : భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ఘనంగా జరుపుకునే ఐఫా ఉత్సవం 2024 మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ భారీ వేదికపై అవార్డులు అందుకోబోతున్న పలువు సౌత్ స్టార్స్ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈవెంట్ కు హాజరు కాబోతున్న దిగ్గజ నటీనటులు ఎవరు ? అనే విషయాలతో పాటు అవార్డులను గెలుచుకున్న దర్శకులు, నటీనటుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్క అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఆమె హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ ఐఫాలో బెస్ట్ డైలాగ్స్ కేటగిరీలో అవార్డును దక్కించుకున్నారు.

అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, టాప్ హీరోయిన్ అనుష్క జంటగా నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇందులో అనుష్క మాస్టర్ చెఫ్ గా నటించగా, నవీన్ స్టాండప్ కమెడియన్ గా సందడి చేశాడు. ఈ సినిమాలో అనుష్క, నవీన్ తో పాటు హీరోయిన్ సోనియా, మురళీ శర్మ, నాజర్, జయసుధ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రధన్ సంగీతం అందించగా, గోపి సుందర్ నేపథ్య సంగీతం అందించారు. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ 2023 సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి సరిగ్గా సంవత్సరం పూర్తయ్యాక అనుష్క అభిమానులకు ఈ గుడ్ న్యూస్ అందింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ డైరెక్టర్ మహేష్ బాబును బెస్ట్ డైలాగ్స్ కేటగిరీలో ఐఫా 2024 అవార్డు వరించింది. ఈ విషయాన్ని యువి క్రియేషన్స్ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తమ డైరెక్టర్ కి కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ “మీ ఎక్స్ట్రాడినరీ రైటింగ్ స్కిల్స్ కచ్చితంగా ఈ గౌరవాన్ని అందుకోవాల్సిందే” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మహేష్ బాబుకు అభినందనల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం మహేష్ బాబు యంగ్ హీరో రామ్ పోతినేనితో మూవీ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో కీలక పాత్రకు ముందుగా బాలయ్య ను అనుకోగా, రజినీకాంత్ ఫైనల్ అయ్యారని సమాచారం. మరోవైపు చాలా కాలంగా అనుష్క సినిమాల గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు కూడా ఈ గుడ్ న్యూస్ తో కాస్త ఊరట లభించినట్టు అయ్యింది.

Image

- Advertisement -

ఐఫా అవార్డులు-2024 మొదలయ్యేది ఎప్పుడంటే?

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ -2024 (IIFA)లో ఇటీవల విడుదలైన తాజా చిత్రాలు, నటీనటులు, నటీమణులు, దర్శకులతో పాటు పలువురు టెక్నీషియన్లను అవార్డుతో గౌరవించనున్నారు. IIFA ఉత్సవం మూడు రోజుల కోలాహలం కానుంది. అబుదాబిలో సెప్టెంబర్ 27న జరగనున్న ఈ ఈవెంట్‌ను రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ఈవెంట్ కు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, ఉలగనాయగన్ కమల్ హాసన్, చియాన్ విక్రమ్, నందమూరి బాలకృష్ణ, మణిరత్నం, సుహాసిని మనిరత్నం, దర్శన్, రిషబ్ శెట్టి, నివిన్ పౌలీ, శింబు, శివకార్తికేయన్, ఎస్‌జె సూర్య, నిత్యా మీనన్, నిత్యా మీనన్, దేవి శ్రీ ప్రసాద్, రసూల్ పూకుట్టి వంటి సౌత్ స్టార్స్ అందరూ హాజరుకానున్నారు. మొదటి రోజు ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గౌరవాన్ని అందుకోబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు