Hit 3 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సాయికుమార్ నటించిన పోలీస్ స్టోరీ(Police Story) సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో చాలామంది స్టార్ హీరోస్ పోలీస్ పాత్రలలో కనిపించారు. సీనియర్ స్టార్ హీరోస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ వరకు అందరూ పవర్ఫుల్ కాప్ రోల్ లో కనిపించారు. వీటన్నిటిని మించి ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు(Vikramarkudu) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో రవితేజ నటించిన విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 10 ఏళ్లపాటు హిట్ లేకపోతే ఆ సినిమా పవర్ఫుల్ కం బ్యాక్ అయింది. అలానే మహేష్ బాబు నటించిన పోకిరి(Pokiri) .సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన దూకుడు(Dookudu) సినిమా కూడా ఆల్టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ఆగడు సినిమా థియేటర్స్ లో ఆడకుండా వెళ్ళిపోయింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు కాప్ రోల్ చేయలేదు అయితే మొదటిసారి శైలేష్ కొలను దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చేసిన హిట్ 2 కూడా మంచి హిట్ అయింది దీనిలో అడవిశేష్ హీరోగా కనిపించాడు. ఇక హిట్ 2 క్లైమాక్స్ లో నాని ని చూపించాడు దర్శకుడు. ఇప్పుడు హిట్ 3 సినిమాతో నాని బ్రాక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారికంగా విడుదల చేశారు.
గతంలో నాని మాట్లాడుతూ విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లాంటిది దొరికితే తప్ప నేను కాప్ రోల్ చేయను అని నాని రవితేజతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక విక్రమ్ సింగ్ రాథోడ్ అనేది ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాని పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటే అంత వర్తున్న క్యారెక్టర్ చేస్తున్నాడా అనేది చాలామంది అంచనాలు పెంచుకుంటున్నారు. మరి శైలేష్ ఎలా ప్లాన్ చేశాడో వేచి చూడాలి.