Hero’s: హీరోయిన్స్ పై మోజుతో జైలు పాలైన హీరోలు..!

Hero’s: సాధారణంగా ఎక్కడైనా సరే జీవితంలో ఒక వ్యక్తికి మాత్రమే చోటు ఇవ్వాలి అని ధర్మం చెబుతోంది. అయితే ఆ ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి.. మొదట పెద్దల కోసమో లేక తమకు నచ్చి ఒకరిని వివాహం చేసుకోవడం లేదా ప్రేమించడం లాంటివి చేస్తారు అయితే ఆ ఇద్దరు మధ్య విభేదాలు వస్తే మాత్రం ఇంకొకరిని చూసుకుంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమేమిటంటే.. తమకు నచ్చిన వారినీ ఎవరైనా ఏమైనా బెదిరించినా, తిట్టినా, లేకపోతే వారితో చాలా క్లోజ్ గా మూవ్ అయినా సరే.. తట్టుకోలేక వారి కోసం చేయరాని తప్పులు చేసి ఏకంగా జైలుకు వెళ్లారు.. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

Hero's: Heroes who were jailed for being crazy about heroines..!
Hero’s: Heroes who were jailed for being crazy about heroines..!

హీరో దర్శన్:

కన్నడ హీరో దర్శన్ ఆ ఇండస్ట్రీ వరకు మాత్రమే పరిచయం.. అయితే ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో బాగా ఈయన పేరు మారూమ్రోగిపోతోంది. వాస్తవానికి హీరోగా అందరికీ పరిచయమైతే బాగానే ఉంది కానీ హత్య చేసి ఇప్పుడు అందరికీ తన పేరు తెలిసేలా చేశాడు.. అదేంటి ఒక హీరో హత్య చేయడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? రీల్ లైఫ్ లో చేసే పనులు రియల్ లైఫ్ లో చేస్తే ప్రజలు ఊరుకుంటారా అటు పోలీసులు కూడా పట్టుకొని జైల్లో వేశారు.. అయితే ఈ జైలు పాలు అవడానికి వెనుక చాలా పెద్ద కథే ఉంది.. దర్శన్ కి పెళ్లి అయ్యి భార్య , కొడుకు ఉన్నప్పటికీ పవిత్ర గౌడ అనే కన్నడ నటితో పదేళ్లుగా.. ప్రేమాయణం సాగిస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు.. అది తట్టుకోలేని ఆయన అభిమాని పవిత్రతో అసభ్యంగా ప్రవర్తించాడట.దాంతో మనుషులను పెట్టి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు దర్శనం.. ఇక అంతే ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అన్నట్టుగా కటకటాల పాలవ్వాల్సి వచ్చింది. ఇలా దర్శన్ తరహాలోనే అమ్మాయి కోసం జైలు పాలైన మరో మలయాళ ఇండస్ట్రీని నటుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు దిలీప్.

- Advertisement -

హీరో దిలీప్:

మలయాళ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నారు దిలీప్.. ఈయనకి భార్య మంజు వారియర్ ఉండగానే కావ్య మాధవన్ తో ప్రేమలో పడి.. చివరికి కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చి కావ్య ను వివాహం చేసుకున్నాడు.. కావ్యకి మరో హీరోయిన్ భావనకి సరిపోకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.. ఇక కావ్యకి మద్దతు ఇవ్వడానికి ఏకంగా భావనపై రేప్ అటెంప్ట్ చేయించాడు దిలీప్. దాంతో చాలా రోజులపాటు జైల్లో గడపాల్సి వచ్చింది.

సల్మాన్ ఖాన్:

నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలా ప్రేమించిన వారి కోసం హత్యలు చేయడం లేదా అమ్మాయిలు వేధించడం లాంటివి సల్మాన్ ఖాన్ తోనే మొదలయ్యాయి అని చెప్పవచ్చు.. సల్మాన్ ఖాన్.. ఐశ్వర్యారాయ్ ను ఎంతగానో ప్రేమించాడు.. అదే సమయంలో ఆమె వివేక్ ఒబెరాయ్ తో క్లోజ్ గా ఉంటుందన్న కారణంతో అతడి పై దాడి కూడా చేశారు సల్మాన్ ఖాన్. ఇక తర్వాత ఐశ్వర్య కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని గొడవ చేశారట.. ఇక తట్టుకోలేక పోలీస్ కేసు పెట్టాడు ఐశ్వర్యరాయ్ తండ్రి.. అలా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు సల్మాన్ ఖాన్.. చివరికి సల్మాన్ కి దూరమైన ఐశ్వర్యారాయ్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకోగా.. వీరికి కూతురు ఆద్య జన్మించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు