Heroine Sada: దానిపై మోజుతో ఇండస్ట్రీకి దూరం కానున్న హీరోయిన్..!

Heroine Sada.. ప్రముఖ హీరోయిన్ సదా తొలి సినిమాతోనే తెలుగు కుర్రాల హృదయాలను దోచుకుంది.. అందం, అభినయంతో పాటు సాంప్రదాయంగా కనిపించి యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈమె.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. అందరి దృష్టిని ఆకర్షించింది.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకుంది.. దశాబ్ద కాలంగా సినిమాలలో అలరించిన ఈమె.. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది. పెళ్లి చేసుకోకుండా.. ఎఫైర్ రూమర్స్ కి తావు ఇవ్వకుండా.. ఒంటరి జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇంతకూ ఆమె ఎవరు అనుకుంటున్నారా ఆమె మన అందాల తార సదా..

Heroine Sada: Heroine who is going to stay away from the industry because of her passion..!
Heroine Sada: Heroine who is going to stay away from the industry because of her passion..!

ఇండస్ట్రీకి దూరం కానున్న సదా..

2003లో నితిన్ హీరోగా పరిచయమైన జయం సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకొని.. చాలామంది అభిమానులను దక్కించుకుంది. తెలుగు, కన్నడ, తమిళ్ భాషలో అనేక చిత్రాలలో నటించిన సదా హోమ్లీ లుక్ తో… అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాలో హీరోయిన్ గా నటించి.. మరోసారి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్న ఈమె.. ఏమైందో తెలియదు కానీ డిజాస్టర్స్ వైపు అడుగులు వేసింది.. ఇక ఇప్పుడు దాదాపుగా కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైందనే చెప్పాలి.. అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన సదా కొన్నాళ్లుగా బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాదు గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మొన్నటి వరకు దర్శకుల కంట్లో పడే ప్రయత్నం చేసింది.. కానీ ఏమైందో తెలియదు కానీ ఈమెకు అవకాశాలు రాలేదు.. దీంతో విసిగిపోయిన సదా దానిపై మోజుతో ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి..

కొత్త అవతారం ఎత్తనున్న సదా..

అసలు విషయంలోకి వెళ్తే.. సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పైన దృష్టి పెట్టినట్లుగా సమాచారం.. కొన్ని నెలలుగా తన ఇన్స్టాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోలు వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అడవిలో కనిపించే అందమైన పక్షులు , పులులు, ఏనుగులు, సింహాలు ఇలా అన్నింటిని ఫోటోలు, వీడియోలు తీస్తూ తన ఇన్స్టా లో షేర్ చేస్తోంది.. సదా చేసిన పోస్టులకు భారీ సంఖ్యలో లైక్స్ కూడా వస్తున్నాయి.. ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి అంతకంటే భయంకరమైన పులులను, సింహాలను అంతే అందంగా కెమెరాలో బంధిస్తోంది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక తాజాగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పై ఆసక్తి చూపుతున్న ఈమె ఇక ఇండస్ట్రీకి దూరం కానుంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.ఇక ప్రస్తుతం నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని .. తన ఫ్రీడంను పోగొట్టుకోవాలని అనుకోవడంలేదని.. నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు దొరకలేదని.. అందుకే పెళ్లి కూడా చేసుకోలేదని స్పష్టం చేసింది సదా.. మొత్తానికి అయితే ఇండస్ట్రీకి దూరం కాబోతుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు