Faria Abdullah : జాతి రత్నాలు ఫేమ్ హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah )పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ఆ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూ క్యూట్ అందాలతో జనాలను తనవైపుకు తిప్పుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా నటించింది. కానీ సెకండ్ హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ అమ్మడు రీసెంట్ గా అల్లరి నరేష్ ( Allari Naresh )హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఓటీటీ లో దూసుకుపోతుంది. ఈ సినిమా ఒకవైపు మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్లను కురిపిస్తుంది.. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ ను అయితే అందుకుంది.. ఇదిలా ఉండగా.. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. ఈ సందర్బంగా ఎన్నో విషయాలను అందరికీ చెప్పింది.. అందులో భాగంగా తన సినిమాలో తానే కొరియోగ్రఫి చేస్తున్నట్లు చెప్పింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయానికొస్తే.. తాజాగా మత్తు వదలరా 2 ( Mattu Vdalara 2) టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఫరియా మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించునున్నట్లు చెప్పింది. ర్యాప్ లుక్ లో దర్శనం ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే ఈ సినిమాలో కొన్ని పాటలకు తానే కొరియో గ్రాఫర్ గా చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ డ్యాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక గతంలో ఈమె పెళ్లి పై ఎన్నో వార్తలు వినిపించాయి. పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదు. కానీ నాకు పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం.. అయితే అమ్మ అవుతాను.. పెళ్లి గురించి ఆలోచించాలి అని చెప్పుకొచ్చింది.. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి.