Hero Jiiva : తమిళ హీరో జీవా (Jiiva) పేరుకు పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో కేవలం ఆయన తమిళ సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారకు ప్రమాదం జరిగిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
నటుడు జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై (Chennai ) నుంచి సెలం (Selam ) వెళ్తుండగా కన్నిమయూర్ వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగింది. అడ్డుగా వచ్చిన బైకు ను తప్పించబోయి బార్కేడ్ ను ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. కారు ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది..
కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యిందని తెలుస్తుంది. కారు పరిస్థితే ఇలా ఉందంటే ఇక మనిషి పరిస్థితి ఎలా ఉందో అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అసలు కారులో ఆయన ఉన్నాడా? లేదా ఎవరైనా ఉన్నారా? అందులో ప్రయాణించింది ఆయనే అయితే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై తమిళ నాడు మీడియా లో మారు మోగిపోతుంది. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో కాసేపు ఆగితే తెలిసే పరిస్థితి అవకాశం ఉంది..
ఇక జీవా ఇటీవల వార్తల్లో నిలిచారు.. తేనిలోని ఓ టెక్స్టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన జీవా.. అక్కడికి వచ్చిన అభిమానులతో ఫొటోలు దిగారు. ఆ సమయంలో కొందరు రిపోర్టర్స్ ఆయనను ప్రశ్నలు అడిగారు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయా? అని అడగ్గా.. ‘చాలా రోజుల తర్వాత తేనీకి వచ్చాను. చాలా పరిశ్రమల లో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం మా పని. కేరళలో లాగా తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, వివాదాలు లేవు. మంచి పని కోసం వస్తే దయచేసి ఇలాంటి పనులు అడగకండి అని రిపోర్టర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అది ఎంత పెద్ద చర్చలకు దారి తీసిందో అందరికీ తెలుసు.. ఆ వార్త మరువక ముందే ఈ ప్రమాదం జరిగింది..
ఇక జీవా సినిమాల విషయానికొస్తే.. జీవా 2003 లో ఆసాయ్ ఆసాయి అనే సినిమా తో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత అతను నటించిన రామ్ సినిమాకుగాను సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. డిష్యుం , ఇ , కట్ట్రధు తమిజ్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గయ్యడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.