Hebah Patel: టాలీవుడ్ అందాల భామ హెబ్బా పటేల్ (Hebah Patel) గురించి తెలియని వారు ఉండరు. “కుమారి 21ఎఫ్” సినిమాతో ఒక్కసారిగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది హెబ్బా పటేల్. అంతకుముందు వరుణ్ సందేశ్ తో కలిసి “అలా ఎలా” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో హెబ్బాకు అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ భామ .
ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ కు (Hebah Patel) సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లోనూ ఈ చిన్నది నటిస్తోంది. అంతేకాదు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించి మెప్పిస్తోంది. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. పలు సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. హెబ్బా నటించిన ఓదేలు రైల్వే స్టేషన్ సినిమా (odela railway station) ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం హెబ్బాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేకపోతున్నారు.
ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాల ఆరబోత చేస్తూ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. నటన పరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వర్ణించలేనిదని చెప్పవచ్చు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చీరలో చేసిన గ్లామర్ ఫోటోషూట్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో హెబ్బా అందాలు అభిమానులను చూపుతిప్పుకోకుండా చేశాయని చెప్పవచ్చు. ఈ ఫోటోల్లో హెబ్బా (Hebah Patel) చాలా సింపుల్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు.