HBD Thalapathy Vijay : తిరుగులేని “ఇళయ దళపతి” విజయ్ జోసెఫ్”…

HBD Thalapathy Vijay : “ఇళయదళపతి విజయ్”. ఈ పేరు గురించి సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. తమిళనాట రజిని తరవాత అత్యధిక అభిమానులని సొంతం చేసుకుని, తన సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నాడు. విజయ్ సినిమా వచ్చిందంటే తమిళనాట అభిమానులకు పండగే. ఈ హీరో స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం విజిల్స్ మోతే. తన స్క్రీన్ ప్రెజెన్స్ కి విజయ్ ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా ఫిదా అయిపోతారు. ఒక హీరో సినిమాకి ఆ హీరోకంటే అభిమానులే ఎక్కువ ప్రమోట్ చేస్తారంటే అది విజయ్ సినిమాలకే ఆ ఘనత చెల్లుతుంది. అంతటి మాస్ క్రేజ్ ఉన్న విజయ్ డైలాగ్ చెప్పినా, డాన్స్ చేసినా, తనకంటూ ఓ సపరేట్ స్టైల్ అఫ్ మేనరిజం విజయ్ సొంతం.

HBD Thalapathy Vijay Birthday Spcial

మాస్ లో తిరుగులేని క్రేజ్ హీరో విజయ్…

త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్‌, శోభ దంప‌తుల‌కు 1974 జూన్ 22న జ‌న్మించిన జోసెఫ్ విజయ్ (HBD Thalapathy Vijay) చ‌దువంతా చెన్నైలోనే కొన‌సాగింది. తండ్రి ద‌ర్శ‌కుడు కావ‌టంతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే కొన్ని చిత్రాల్లో న‌టించాడు. ఇక విజయ్ తన టీనేజ్ లోనే 1992లో ‘నాలై తీర్పు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు కానీ, ఆ త‌ర్వాత ర‌సిగ‌న్‌, దేవా వంటి చిత్రాలు విజయ్ కి హీరోగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇక “పూవే ఉన‌కాగే” (Poove Unakkage) సినిమా విజ‌య్‌కి హీరోగా యూత్ లో మంచి ఇమేజ్‌ను తెచ్చి పెట్టిన చిత్రం. ఆ తర్వాత ‘తుల్లాద మ‌నం తుల్లం’ సినిమా సూప‌ర్ హిట్ కావ‌టంతో విజ‌య్‌కి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఖుషి, ఫ్రెండ్స్‌, యూత్‌, తిరుమ‌లై వంటి చిత్రాలు ఘ‌న విజ‌యాల‌ను సాధించి విజయ్ క్రేజ్‌ను క్ర‌మ క్ర‌మంగా పెంచుతూ వ‌చ్చాయి. అయితే 2004లో విజ‌య్ హీరోగా రూపొందిన “గిల్లి” సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి విజయ్ ని తమిళనాట మాస్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా మ‌హేష్ న‌టించిన ఒక్క‌డు సినిమాకు రీమేక్‌ అని తెలిసిందే. అక్క‌డ నుంచి విజ‌య్ వెనుదిరిగి చూసుకోలేదు. అగ్ర క‌థానాయ‌కుడిగా క్ర‌మంగా ఎదుగుతూ వ‌చ్చాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజయ్ సినిమాలు వ‌రుస విజ‌యాల‌ను సాధించ‌ట‌మే కాకుండా మాస్ హీరోగా విజయ్ ఇమేజ్ ని రెట్టింపు చేసాయి. తుపాకి, తేరి, మెర్స‌ల్‌, స‌ర్కార్‌, బిగిల్‌, మాస్ట‌ర్, లేటెస్ట్ గా లియో ఇలా అన్నీ చిత్రాలు విజయ్ కెరీర్ గ్రాఫ్ ని ఓ రేంజ్ లో పెంచేసాయి.

- Advertisement -

రికార్డులకు కేరాఫ్.. ఇళయదళపతి..

అయితే కొన్నేళ్ల వరకు త‌మిళ చిత్ర రంగానికే ప‌రిమితం కాస్త లేట్ అయినా సౌత్ మొత్తం పాగా వేసాడు. ఇప్పుడు విజయ్ సినిమా వస్తుంది అంటే, తెలుగులో కూడా భారీ బిజినెస్ జరుగుతుంది. విజ‌య్ నటించిన తుపాకీ మొదలుకొని, విజిల్, మాస్టర్, లియో వంటి చిత్రాలు తెలుగులో భారీ సక్సెస్ ని సాధించాయి. ఇక తమిళనాట రికార్డులకు కేరాఫ్ గా విజయ్ సినిమాలు నిలిచాయి. ఎన్నో చిత్రాలు వందల రోజులు థియేటర్లలో సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయి. ఇక యూట్యూబ్ లో విజయ్ కి సంబంధించి సాంగ్, టీజర్ వంటివి రిలీజ్ అయిత్ ఏ రేంజ్ నిమిషాల వ్యవధిలో లక్షల్లో లైకులు, గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చి పడతాయి. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ సినిమాలకి రికార్డ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమాలకి స్వస్తి చెప్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన రాబోయే సినిమా GOAT ” గ్రేటెస్ట్ అఫ్ అల్ టైమ్” సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక సౌత్ ఇండియా వ్యాప్తంగా అశేషంగా మాస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఇళయ దళపతి విజయ్ బర్త్ డే(జూన్22) సందర్బంగా ఆయనకు ఫిల్మీ ఫై తరపున హ్యాపీ బర్త్ డే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు