Harish Shankar : అల్లు అర్జున్ VS పవన్ కళ్యాణ్… మధ్యలో హరీష్ శంకర్‌ను ఇరికించారేంటి…? .

Harish Shankar.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితంగా ఉన్న మెగా అల్లు ఫ్యామిలీలు.. గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా మారిపోయింది. అయితేఈ కుటుంబాల మధ్య ఏముందో తెలియదు కానీ బయటకు మాత్రం మెగా , అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్టుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్.. ప్రచారానికి మాత్రం తన స్నేహితుడు అయిన వైసీపీ నేత వైపు వెళ్లడంతో చాలామంది మెగా అభిమానులు,మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ను విమర్శించడం జరిగింది. పైగా మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా అన్ ఫాలో చేశారు.

Harish Shankar : Allu Arjun VS Pawan Kalyan... What made Harish Shankar in the middle...?
Harish Shankar : Allu Arjun VS Pawan Kalyan… What made Harish Shankar in the middle…?

బన్నీ పై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ విధంగా ఈ విషయం మీద స్పందించలేదు. కానీ ఇటీవలే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ.. పుష్ప చిత్రం పై ఇండైరెక్టుగా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చాలామంది హీరోలు అడవులను కాపాడే పాత్రలలో మాత్రమే చేశారు. కానీ ఇప్పుడు సినిమాలలోని హీరోలు అదే చెట్లను నరికేసి , స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నట్టు గా మాట్లాడడం జరిగింది. దీంతో ఇన్ డైరెక్ట్ గా పుష్ప సినిమాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు అంటూ నెటిజన్స్ వార్తలు వైరల్ చేస్తున్నారు.

అల్లు V’s మెగా.. బన్నీకి సపోర్ట్ గా హరీష్ శంకర్..

దీనికి కౌంటర్ వేస్తూనే అల్లు అర్జున్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలోని డైలాగ్ లిస్టును తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏకీపారేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంలోకి డైరెక్టర్ హరీష్ శంకర్ ను కూడా లాగినట్లు తెలుస్తోంది అల్లు అభిమానులు. డైరెక్టర్ హరీష్ శంకర్ పుష్ప రిలీజ్ టైం లో మాట్లాడిన ఒక వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో పుష్ప సినిమా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తోంది అంటూ యాంకర్ అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం హరీష్ శంకర్ ఇలా తెలియజేశారు..

- Advertisement -

హరీష్ శంకర్ ఓల్డ్ వీడియో వైరల్..

పుష్ప చిత్రంలో పుష్ప క్యారెక్టర్ గంధపు చెట్లను నరుకుతూ ఉంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అని అడగగా.. అందుకు హరీష్ శంకర్ ఇప్పటికే ఈ విషయం పైన ఇద్దరు ముగ్గురు నాతో మాట్లాడారు.. అయితే పుష్ప సినిమా చూసి సాఫ్ట్వేర్లు, ఇతర ఉద్యోగస్తులు తమ ల్యాప్టాప్ లను వదిలేసి అందరూ గొడ్డళ్లు పట్టుకొని తిరుపతికి వెళ్లిపోయారా? అభిమానులు కూడా గొడ్డలి పట్టుకొని అల్లు అర్జున్ లాగా తెగ నరికేసి డబ్బులు సంపాదిస్తున్నారా? అంటూ తెలియజేశారు .ఏదైనా సినిమాని సినిమాలాగానే చూడాలి అంటూ హరీష్ శంకర్ తెలియజేశారు. వాస్తవానికి ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం అల్లు అభిమానులు సిట్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అవుతుండడంతో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ శంకర్ ఓల్డ్ వీడియోతో సైతం బన్నీ అభిమానులు కౌంటర్ వేస్తూ ఉన్నారు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం లోకి హరీష్ శంకర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు..ఇక పుష్ప-2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
V

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు