Game Changer : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. కానీ దాని కంటే ముందు భారతీయుడు 2ను రిలీజ్ చేశారు శంకర్.. అయితే ఈ సినిమాను డిసెంబర్ లో క్రిష్టమస్ పండుగ కానుకగా రాబోతుందని ఇటీవల దిల్ రాజు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫ్యాన్స్‌కి మాత్రం నమ్మకం కలగలేదు. కానీ తాజాగా వారికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు.. తాజాగా గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు మెగా ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చాడు..
హీరో రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. ఇక చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ ఉంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాది చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజ్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అయితే తాజాగా క్రిష్టమస్ కానుకగా సినిమా రాబోతుందని దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. డబ్బింగ్ పూర్తి అయినట్లు ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అదే ప్రూప్..
గేమ్ ఛేంజర్ టీమ్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టేసింది. మెగా ఫైర్ వర్క్స్‌కి రెడీ అయిపోండి.. క్రిస్మస్ 2024″ అంటూ డబ్బింగ్ సెషన్ ఫొటోలను షేర్ చేశారు దిల్ రాజు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దిల్ రాజు మాట ఇచ్చాడంటే ఇక అది జరిగిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. క్రిస్మస్కి థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటూ ఇప్పటికే గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.. పుష్ప 2 కూడా అప్పుడే రాబోతుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈసారి మెగా Vs అల్లు వార్ చూడాలని ఇటు బన్నీ, అటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. మరి ఈ రెండు సినిమాలు ఎలా పోటి పడతాయో.. ఎంత కలెక్షన్స్ రాబడుతాయో చూడాలి.