GOAT First Review : కోలీవుడ్ స్టార్ దలపతి విజయ్ కొత్త సినిమా గోట్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఇక సినిమా విడుదలకు టైమ్ దగ్గర పడుతుండగా, తాజాగా ఈ మూవీ ఎలా ఉందనే టాక్ బయటకు వచ్చింది. మరి గోట్ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
గోట్ ఫస్ట్ రివ్యూ
స్టార్ హీరో విజయ్, మీనాక్షీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గోట్. మోహన్, ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)కు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, అర్చన కల్పాతి నిర్మిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ థియేటర్లలో గోడ్ విడుదల కానుండగా, UK సెన్సార్ బోర్డు ఈ చిత్రం ఫస్ట్ రివ్యూను విడుదల చేసింది. యూకే సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, రక్తికట్టించే పోరాట సన్నివేశాలతో అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 15 ఏళ్లు పైబడిన వారు చూడవచ్చని గోట్ మూవీని చూసిన యూకే సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ టాక్ చూస్తుంటే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. అలాగే డైరెక్టర్ వెంకట్ ప్రభు, విజయ్ కూడా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు గోట్ 15 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. తమిళనాడులోని అన్ని థియేటర్లలో గోట్ సినిమా బుకింగ్స్ ఈరోజు రాత్రి ప్రారంభమవుతాయని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు.
రిలీజ్ కి ముందే నెగెటివ్ టాక్
గోట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, పాటలు మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. విజిల్ పొడు వంటి పాటలు ఓ మోస్తరుగా ఆదరణ పొందగా, పాటలు ఆశించిన స్థాయిలో లేవని అభిమానులు విమర్శించారు. అలాగే గోట్ లో ఉపయోగించిన AI బాలేదని స్వయంగా విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ రిలీజ్ కు ముందే తీవ్రమైన నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే డైరెక్టర్ వెంకట్ ప్రభు మాత్రం సినిమా 3 గంటల 3 నిమిషాల రన్టైమ్తో ఫాస్ట్ పేస్ స్క్రిప్ట్ ఉంటుందని, ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని ప్రమోషన్స్‌లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చిత్రంలోని 4వ సింగిల్ ను విడుదల చేశారు. ఈ పాటలో త్రిష డ్యాన్స్ అదరగొట్టిందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలంటే మూవీని తెరపై చూసేదాకా ఆగాల్సిందే. కాగా ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు పెద్దగా బజ్ లేకుండా గోట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలాంటి టైమ్ లో గోట్ మూవీ గురించి యూకే సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ టాక్ రావడం నిజంగా విజయ్ ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చినట్టుగా అయ్యింది.