Gabbarsingh4k : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తున్న సందర్బంగా మళ్ళీ పవన్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) నటించిన గబ్బర్ సింగ్ సినిమా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. నిజానికి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామని అనుకున్నా, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, గుడుంబా శంకర్ లని రిలీజ్ చేయడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ప్రకటించడం మొదలు, పలు ఫేమస్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హౌస్ ఫుల్ అయిపోయాయి. రీ రిలీజ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా అడ్వాన్స్ సేల్స్ తోనే పవర్ స్టార్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
అప్పుడే అన్నయ్యని దాటేశాడు!
ఇక గబ్బర్ సింగ్ (Gabbarsingh4k) సినిమా రీ రిలీజ్ లో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. రీ రిలీజ్ అడ్వాన్స్ సేల్స్ లో గబ్బర్ సింగ్ ఆల్రెడీ నాలుగు రోజుల కిందే కోటిన్నర మార్క్ ని క్రాస్ చేయగా, లేటెస్ట్ గా ఏకంగా అన్నయ్యనే బ్రేక్ చేసేసాడు. అవును.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఇంద్ర సినిమా రీ రిలీజ్ లో 3.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గబ్బర్ సింగ్ తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 కోట్ల మార్క్ ని దాటేయగా, రేపటిలోగా ఇంద్ర (Indra) పూర్తి వసూళ్లు బ్రేక్ చేయడం గ్యారెంటీ.
అల్ టైం రికార్డ్ బ్రేక్ చేస్తాడా?
ఇక గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ పలు రికార్డులు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన సినిమాల్లో మహేష్ బాబు మురారి (Murari) అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుని రీ రిలీజ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మురారి రీ రిలీజ్ లో ఏకంగా 10 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక లేటెస్ట్ గా ఇంద్ర ఓవరాల్ గా రికార్డ్ వసూళ్లు అందుకోకపోయినా, ఓవర్సీస్, బెంగుళూర్ లో అల్ టైం రికార్డ్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయాల్సిన టైం వచ్చేసింది. పైగా ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా ఏది రాకపోవడంతో ఫ్యాన్స్ ఆకలిమీదున్నారు, అందువల్ల గబ్బర్ సింగ్ తో పవన్ ని మళ్ళీ స్క్రీన్ పై చూడ్డానికి రెడీ అవుతున్నారు.