Fish Venkat.. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ (Fish Venkat) గంభీరమైన గొంతుతో డైలాగులు చెబుతూ.. ఒకపక్క విలనిజంలో కూడా కామెడీ పండించగల ఏకైక వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు. అద్భుతమైన ముఖ కవళికలతో ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఏడిపించగలరు కూడా.. ఎన్నో వందలాది చిత్రాలలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్ , గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు ఆయనకు తన శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లకు వెళ్లకపోవడంతో.. ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టాయి. కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో ఒకవైపు ఆర్థిక సమస్యలు మరొకవైపు ఆరోగ్య సమస్యలు ఆయనను మరింత అతలాకుతలం చేశాయి. దీంతో సహాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు.
దీనస్థితిలో ఫిష్ వెంకట్..
గత కొద్ది రోజులుగా డయాబెటిక్ సమస్యలతోపాటు బీపీ సమస్యలు ఆయనను మరింత అనారోగ్యానికి గురిచేసాయి. కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురి కావడంతో పాటు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన దీనస్థితి వెలుగులోకి రావడంతో ఒక ఇంటర్వ్యూ వేదికగా తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూసి చలించి పోయిన మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయంగా సహాయం చేయాలనుకున్నారు.. అయితే ఇటీవల ఒక హాస్పిటల్ అధినేత తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన కాలుకు సర్జరీ చేయించి కాలు పూర్తిగా కోలుకున్న తర్వాత రెండు కిడ్నీలకు కూడా ఆపరేషన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆలస్యం చేసి ఉంటే కాలు తీసేయాల్సిన పరిస్థితి..
మరి ఫిష్ వెంకట్ తన అనారోగ్య పరిస్థితితో.. హాస్పిటల్ కి వచ్చినప్పుడు, ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాలను రవి స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే.. ఆ హాస్పిటల్ అధినేత మాట్లాడుతూ..ఫిష్ వెంకట్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి చూస్తే నేనే చలించి పోయాను. ఎప్పుడూ మనల్ని కడుపుబ్బా నవ్వించే ఈయన పరిస్థితి ఇలా అయిందేంటి అంటూ ఎమోషనల్ అయ్యాను. ఆయన పరిస్థితి చూసిన తర్వాత కాలు పూర్తిగా డామేజ్ అయిపోయింది. ఆ కాలు నుంచి చీము, రక్తం కారుతోంది. ఇక దాన్ని చూసిన తర్వాత.. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఇంకా డిలే చేస్తే కాల్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చేది. దీనికి తోడు షుగర్ కంట్రోల్ లేకపోవడం తో పాటూ రెండు కిడ్నీలు డామేజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారింది. ఇక దాంతో చేసేదేమీ లేక మొదట హాస్పిటల్ లో ఉన్న డాక్టర్స్ పిలిపించి ఆయన హెల్త్ చెకప్ చేయించి.. కాలుకు సర్జరీ చేసాము. ఆ తర్వాత డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము. ముందుగా ఆయన ఆరోగ్య పరిస్థితి చెక్ చేసిన తర్వాత షుగర్ కంట్రోల్ లోకి వస్తే కిడ్నీ మార్చడం లేదంటే లాంగ్ టర్మ్ డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము అంటూ ఆయన తెలిపారు.
ఫిష్ వెంకట్ కి సహాయం చేసిన సెలెబ్రిటీస్ వీళ్ళే…
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి తదుపరి ప్రొసీజర్ కు వెళ్తాము అంటూ తెలిపారు. ఒక 20 రోజులు ఆలస్యం చేసి ఉంటే కాలు మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదట. కానీ వెంటనే పి ఆర్ కె హాస్పిటల్స్ అధినేత స్పందించి ఆయనకు కావాల్సిన పూర్తి వైద్య సహాయాన్ని అందిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ తో పాటూ ఈయన వీడియో చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియా ద్వారా ఈ విలన్ కి సహాయం చేస్తున్నారు.