Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ – మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) కాంబినేషన్ లో “కూలీ” అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. జైలర్ తర్వాత రజినీకాంత్ నటిస్తున్న సినిమా కావడం, పైగా లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా కూలీ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది.
కూలీ షూటింగ్ లో అగ్ని ప్రమాదం..
రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుండగా, అక్క్కడ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న ఓ కంటెయినర్ టెర్మినల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, అప్రమత్తమై అప్పుడే అక్కడికే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే ఈ కంటైనర్ ఇక్కడిది కాదు. అందిన సమాచారం ప్రకారం, ఆ కంటైనర్ షిప్ చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్ తో గత నెల 28న విశాఖ పోర్టుకి వచ్చిందని సమాచారం. ఏం జరిగిందో సరిగా తెలీదు గాని, ఒక్కసారిగా కంటెయినర్ టెర్మినల్ లో ప్రమాదం జరగగా, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో, కూలీ (Coolie) చిత్ర యూనిట్ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
రజినీకాంత్ కూలీ మూవీ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం…
విశాఖలో షూటింగ్ జరుగుతున్న టైంలో లిథియం బ్యాటరీల కంటెయినర్ టెర్మినల్లో ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న రజనీకాంత్ కూలీ సినిమా యూనిట్.#Coolie #Nagarjuna #LokeshKanagaraj #AmirKhan #Vettaiyan #Kubera #Rajinikanth #Kollywood… pic.twitter.com/iPRDZHrlHv
— Filmify Official (@FilmifyTelugu) September 14, 2024
ఫినిషింగ్ స్టేజి లో కూలీ…
ఇక రజినీకాంత్ – లోకేష్ కానగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం పూర్తయి పోగా, పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుండి నాగార్జున (Nagarjuna), కన్నడ నుండి ఉపేంద్ర (Upendra) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి కి వచ్చేయగా, రజినీకాంత్ నటిస్తున్న వేట్టైయన్ సినిమా రిలీజ్ అయ్యాకే ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక కూలీ దాదాపుగా నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పాలి.