Filmy Encyclopedia of Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి

బాల్యం: 

19955 వ సంవత్సరం ఆగస్టు 22న, పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు కొణిదెల శివశంకర వరప్రసాద్ మొదటి సంతానంగా జన్మించారు.  తండ్రి పోలీస్ ఉద్యోగం కావడం వల్ల, చిరంజీవి (శివశంకర వరప్రసాద్) గారి బాల్యం  అంతా  వివిధ ప్రాంతాలలో గడిపారు. బాల్యం నుండే నటన మీద ఉన్న ఆసక్తితో, చదువు పూర్తి చేసిన తర్వాత 1976 లో చెన్నై వెళ్లి నటనలో శిక్షణ పొందారు. 

కుటుంబం:

- Advertisement -

చిరంజీవి గారికి అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారితో 1980 ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. సుష్మిత, రామ్ చరణ్, శ్రీజ వారి సంతానం. చిరంజీవిగారికి ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇద్దరు చెల్లెల్లు విజయదుర్గ, మాధవి. 

నట ప్రస్థానం:

నటనలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత , 1978లో చిరంజీవికి మొట్టమొదటి అవకాశం పునాదిరాళ్ళు ద్వారా వచ్చింది. కానీ, ప్రాణం ఖరీదు అనే చిత్రం ముందు విడుదల అయ్యింది.  ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేస్కుని అశేష అభిమానుల్ని  సంపాదించుకున్నారు. మొదట చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయినప్పట్టికీ, ప్రతినాయక పాత్రలద్వారా దర్శకులను, నిర్మాతలని మెప్పించి, 80 90 లలో పూర్తిగా వాణిజ్య విలువలున్న చిత్రాలలో కథానాయకుడిగా తనదైన ముద్ర వేశారు. అయన నటించిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసాయి. బిగ్ బాస్ చిత్రానికి అయన అందుకున్న పారితోషం అక్షరాలా కోటి రూపాయలు. భారత దేశ సినీ చరిత్రలో కోటిరూపాయలు పారితోషికం అందుకున్న మొట్టమొదటి సినీ హీరో చిరంజీవి గారే. అప్పట్లో బాలీవుడ్ మీడియా “Bigger than Bacchan” అని కధనాలు ప్రచురించాయి.   

 

ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలు:

year

Movie

2022 గాడ్ ఫాదర్
ఆచార్య
2019 సైరా నరసింహారెడ్డి
2017 ఖైదీ నంబర్ 150
2007 శంకర్‌దాదా జిందాబాద్
2006 స్టాలిన్
2005 జై చిరంజీవ
అందరివాడు
2004 శంకర్ దాదా MBBS
అంజి
2003 ఠాగూర్
2002 ఇంద్ర
2001 డాడీ
మంజునాథ
మృగరాజు
2000 అన్నయ్య
1999 ఇద్దరు మిత్రులు
స్నేహం కోసం
1998 చూడాలనివుంది
బావగారూ బాగున్నారా?
1997 మాస్టర్
హిట్లర్
1995 రిక్షావాడు
బిగ్ బాస్
అల్లుడా మజాకా
1994 ది జంటిల్ మ్యాన్
ఎస్.పి.పరశురాం
ముగ్గురు మొనగాళ్ళు
1993 మెకానిక్ అల్లుడు
ముఠామేస్త్రి
1992 ఆపద్బాంధవుడు
ఆజ్ కా గూండారాజ్
హే హీరో (మలయాళం)
ఘరానా మొగుడు
1991 రౌడీ అల్లుడు
గ్యాంగ్ లీడర్
స్టూవర్టుపురం పోలీసుస్టేషన్
1990 రాజా విక్రమార్క
ప్రతిబంధ్
కొదమసింహం
జగదేకవీరుడు అతిలోకసుందరి
కొండవీటి దొంగ
1989 లంకేశ్వరుడు
రుద్రనేత్ర
స్టేట్ రౌడి
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
1988 యుద్ధభూమి
త్రినేత్రుడు
మరణ మృదంగం
ఖైదీ నెంబరు.786
యముడికి మొగుడు
రుద్రవీణ
మంచి దొంగ
1987 జేబుదొంగ
స్వయంకృషి
పసివాడి ప్రాణం
చక్రవర్తి
ఆరాధన
దొంగ మొగుడు
1986 చాణక్య శపధం
ధైర్యవంతుడు
రాక్షసుడు
చంటబ్బాయి
వేట
మగధీరుడు
కొండవీటి రాజా
కిరాతకుడు
1985 విజేత
అడవిదొంగ
రక్తసింధూరం
పులి
జ్వాల
చిరంజీవి
దొంగ
చట్టంతో పోరాటం
1984 రుస్తుం
అగ్నిగుండం
నాగు
ఇంటిగుట్టు
ఛాలెంజ్
మహానగరంలో మాయగాడు
దేవాంతకుడు
హీరో
గూండా
అల్లుళ్ళు వస్తున్నారు
1983 సంఘర్షణ
మంత్రిగారి వియ్యంకుడు
ఖైదీ
సింహపురి సింహం
మా ఇంటి ప్రేమాయణం
రోషగాడు
మగమహారాజు
గూఢచారి నెం.1
పులి బెబ్బులి
శివుడు శివుడు శివుడు
ఆలయశిఖరం
అభిలాష
పల్లెటూరి మొనగాడు
ప్రేమ పిచ్చోళ్ళు
1982 ప్రేమ పిచ్చోళ్ళు
మంచు పల్లకి
మొండిఘటం
యమకింకరుడు
బిల్లా రంగా
పట్నం వచ్చిన పతివ్రతలు
టింగు రంగడు
రాధ మై డార్లింగ్
సీతాదేవి
ఇది పెళ్ళంటారా
శుభలేఖ
బందిపోటు సింహం
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
1981 కిరాయి రౌడీలు
చట్టానికి కళ్ళు లేవు
ప్రియ
శ్రీరస్తు శుభమస్తు
47 రోజులు
రాణీకాసుల రంగమ్మ
ఊరికిచ్చిన మాట
న్యాయం కావాలి
తిరుగులేని మనిషి
తోడు దొంగలు
పార్వతీపరమేశ్వరులు
1980 రక్తబంధం
మొగుడు కావాలి
ప్రేమ తరంగాలు
లవ్ ఇన్ సింగపూర్
తాతయ్య ప్రేమలీలలు
కాళి
నకిలీ మనిషి
పున్నమినాగు
మోసగాడు
జాతర
ఆరని మంటలు
చండీప్రియ
అగ్ని సంస్కారం
1979 కోతల రాయుడు
శ్రీరామబంటు
ఇది కథ కాదు
పునాది రాళ్ళు
ఐ లవ్ యూ
కొత్త అల్లుడు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
తాయారమ్మ బంగారయ్య
1978 మనవూరి పాండవులు
ప్రాణం ఖరీదు

 

రాజకీయ ప్రస్తానం:

చిరంజీవిగారు 2008, ఆగస్టు 26న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. సామజిక న్యాయం, అవినీతి రహిత పరిపాలన అనే సిద్ధాంతాలతో రంగంలోకి దిగిన చిరంజీవి, పోటీచేసిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 18% ఓట్లని దక్కించుకున్నాడు. 294 స్థానాలకు గాను 18 స్థానాలలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొంది అసెంబ్లీ లో తన గళాన్ని వినిపించారు.  2011 లో ప్రజారాజ్యం పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపి, విలీనం అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారు  జాతీయ పర్యాటక శాఖా మంత్రివరులుగా కొనసాగి, 2014 లో రాజకీయాలనుండి వైదొలిగారు.    

సేవా కార్యక్రమాలు:

1998 గాంధీ జయతి నాడు “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్” స్థాపించబడింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ కింద బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా రక్త, నేత్ర దానాలు జరుపుతున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. 

సినిమా అభిమానాన్ని సంఘసేవ వైపు మల్లింపజేసి, ఎంతోమందికి కంటిచూపుని, ప్రాణాలని కాపాడేలా చేయడం చిరంజీవి గారు సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. అత్యుత్తమ సేవాసంస్థలుగా ఎన్నోసార్లు ఇవి రాష్త్ర ప్రభుత్వం నుండి అవార్డులు పొందాయి. 

 

This page will be updated continuously.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు