Faria Abdullah.. జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకొని కుర్ర హీరోయిన్ గా మరింత ఇమేజ్ సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) తన అందంతో , యాక్టింగ్ తో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె కటౌట్ కి ప్రభాస్ లాంటి హీరో తప్ప మరెవరు సరిపోరు అనడంలో సందేహం లేదు. అంత పొడవుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక జాతి రత్నాలు సినిమా కమర్షియల్ పరంగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో క్యూట్ గా ఈమె చేసిన పర్ఫామెన్స్ అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు.
హీరోయిన్ మాత్రమే కాదు సింగర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా..
కామెడీ టైమింగ్ తో కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాలలో నటించింది. కానీ స్టార్ హీరో రేంజ్ కి మాత్రం ఈమె ఎదగలేకపోయింది. ఇకపోతే ఇటీవల ఈమె హీరోయిన్ గా నటించిన మత్తు వదలరా 2 సినిమా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో ఫరియా పాత్రకి కూడా మంచి ఇమేజ్ లభించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె ఒక పాటకి లిరిక్ రైటర్ గా, సింగర్ గా, కొరియోగ్రాఫర్ గా కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టింది.
అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగేది..
ఇదంతా పక్కన పెడితే ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేది.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అనే విషయాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈమె ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు దక్కించుకుంది. అంతేకాదు డాన్స్ లో మొదటి నుండి కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిగా పేరు అందుకున్న ఈమె డాన్స్ ఆడిషన్ కోసం చేసిన వీడియోలను తన వెంటపెట్టుకొని ఎన్నో స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగేదట. అలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే జాతి రత్నాలు సినిమాలో అవకాశం లభించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఫరియా అబ్దుల్లా..
ఇకపోతే ఫరియా అబ్దుల్లా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా బాలీవుడ్ లో అనేక టీవీ సీరియల్స్ లో నటించింది. రెండు మూడు బాలీవుడ్ సినిమాలలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఏవి కూడా ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపును అందివ్వలేదు.ఇక పెద్దయ్యాక హీరోయిన్ గా మారే అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తోంది.ముఖ్యంగా ఇంత టాలెంట్, అందం ఉన్నప్పటికీ కూడా సినిమాలలో అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఆమె పొడవు అని చెప్పవచ్చు. ఆమె పొడవుతో సరితూగే హీరోలు లేకపోవడం వల్లే అవకాశాలు రాలేదని సమాచారం. ఏది ఏమైనా ఫరియా అబ్దుల్లా చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నటించింది అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.