DVV Danayya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. లేకపోతే ఒక సినిమాను ప్రమోట్ చేయడంలో ఈ బ్యానర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. ట్విట్టర్ వేదికగా ఈ బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాను ప్రమోట్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. నిన్ను కోరి, ట్రిపుల్ ఆర్, భరత్ అనే నేను వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇదే బ్యానర్ నుంచి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కూడా రానున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ బ్యానర్లు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా సరిపోదా శనివారం. ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ సినిమా పైన అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ట్రైలర్ అన్ని కూడా మంచినాలను మరింత పెంచాయి అని చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు నాని. డివివి దానయ్య కు అసలు కథలు తెలియదు అంటూ చెప్పకువచ్చాడు నాని.
సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో దానయ్య గారు సెట్స్ కి వస్తారు. సెట్స్ కి వచ్చిన తర్వాత ఇదేంటి అదేంటి అని డౌట్స్ అడుగుతుంటారు. అంటే అక్కడితో మనకు అర్థమవుతుంది దానయ్య గారికి ఈ సినిమా కథ తెలియదు అని. ఆయనకి కథ తెలియకపోయినా కూడా ఆయనకి సినిమా మీద ఉన్న డెడికేషన్ వలన గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా ఆయన బ్యానర్ లో వస్తున్నాయి అంటూ ఆ బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలను మెన్షన్ చేశాడు నాని. ఇక అలానే సరిపోదా శనివారం కూడా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఎక్స్ప్లైన్ చేశాడు నాని. ఇక నాని ఇచ్చిన స్టేట్మెంట్ తో కథలు తెలియకుండా సినిమాలు ఎలా చేస్తావు మామ అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.