Kaantha : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తెలుగు, మలయాళం, తమిళం అన్న తేడా లేకుండా పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా తెలుగులో వరుస ప్రాజెక్ట్ లు ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో “లక్కీ భాస్కర్” (Lucky bhaskar) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ దశకు చేరుకోగా, దీపావళి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజగా దుల్కర్ సల్మాన్ హీరోగా మరో సినిమా ప్రారంభమయింది.
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కొత్త సినిమా…
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా రానా (Rana) దగ్గుపాటి సమర్పణలో “కాంతా” (Kaantha) అంటూ ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా అనౌన్స్ అయిన ఇతర ప్రాజెక్ట్ ల వల్ల ఈ సినిమా స్టార్ట్ చేయలేదు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గత సంవత్సరమే ప్రకటించగా, తాజాగా సినిమా ప్రారంభోత్సవం రామా నాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree Borse) హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను స్పిరిట్ మీడియా, స్వప్న సినిమా మరియు వేఫేరర్ ఫిలింస్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, స్వప్న దత్ మరియు దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారని సమాచారం.
త్వరలోనే రెగ్యులర్ షూట్..
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోయే కాంతా ప్రాజెక్ట్ త్వరలోనే రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది. అయితే దుల్కర్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతుందని టాక్. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎవరూ ఊహించని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక రీసెంట్ గా సహనిర్మాత గా 35 చిన్న కథ కాదు అంటూ మంచి సినిమా అందించిన రానా, ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా స్పెషల్ గా ప్రమోట్ చేయనున్నాడు. ఇక కాంతా సినిమా గురించి మారిన్ని వివరాలు తెలియల్సి ఉంది.