దృశ్యం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ దర్శకుడు జీతు జోసఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం’ సినిమా వచ్చింది. దీనికి సీక్వెల్ గా వరుసగా సినిమాలు వస్తునే ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇందులో దృశ్యం 2 ఇప్పటికే మలయాళం, తెలుగు భాషలలో విడులైంది. మంచి విజయాన్ని కూడా నమోదు చేసింది. ఇప్పుడు హిందీలో కూడా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
బాలీవుడ్ లో వచ్చే దృశ్యం సినిమాలో అజయ్ దేవగణ్ తో పాటు శ్రియ కీలక పాత్రలు చేస్తున్నారు. హిందీలో ఇప్పటికే విడులైన దృశ్యం మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో దీనికి సీక్వెల్ పై హిందీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. దృశ్యం 2 కు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ తాజాగా ఒక అప్డేట్ ను ఇచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను గురువారం విడుదల చేశారు. హీరో అజయ్ దేవగణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తొలుత విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 18న థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. దీనిలో అక్షయ్ ఖన్నా, టబు రజత్ కుమార్, ఇషితా దత్తా కూడా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
Read More: Balagam : నాకు 15 ఏళ్లకే పెళ్లి చేసేసారు-రూప లక్ష్మి
Read More: Jailer : షూటింగ్ కి ముహూర్తం
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...