DoubleIsmart : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల కింద వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కడం జరిగింది. ఇక అప్పట్లో ఆ సినిమా 20 కోట్ల బిజినెస్ కి 40 కోట్ల వసూళ్లు అందుకుని బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ ఏకంగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కగా, ఈ సినిమాకు కూడా సాలిడ్ గా బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కి డబుల్ బిజినెస్ జరిగింది. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కి సంబంధించి ఏరియా వైస్ బిజినెస్ డీటెయిల్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి రామ్ పోతినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం.
డబుల్ ఇస్మార్ట్ ఏరియా వైస్ బిజినెస్ డీటెయిల్స్..
ఇక రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) కి సంబంధించి ఏరియా వారీగా బిజినెస్ లెక్కలను గమనిస్తే.. నైజాం 15.50 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 17.50 కోట్ల బిజినెస్ జరగగా, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా తో పాటు, హిందీ వెర్షన్ కలుపుకుని మరో 6 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ లో మరో 3 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతుందని చెప్పాలి.
రాపో కెరీర్ బిగ్గెస్ట్ మాస్ బిజినెస్..
ఇక రామ్ పోతినేని నటించిన సినిమాల్లో ఇంతకు ముందు స్కంద సినిమాకు 46.20 కోట్ల హైయెస్ట్ బిజినెస్ జరగగా, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి డబుల్ ఇస్మార్ట్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో మూవీస్ లవర్స్ లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బి,సి సెంటర్లలో కొంచెం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో కుమ్మేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ఇటు రామ్ పోతినేని, అటు పూరి జగన్నాథ్ ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.