Veena Sreevani: కొందరికి కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ అంటూ ఉంటాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి జాతకాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. అయితే వేణు స్వామి చెప్పిన జాతకాలు చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే నిజమయ్యాయి. ఎక్కువ శాతం వేణు స్వామి చెప్పిన జాతకాలు అన్నీ కూడా ఫెయిల్. ఒక సందర్భంలో బాబు నన్ను నమ్మకండి నాకు జాతకాలు చెప్పడం రాదు అంటూ టీవీ షోలో కూడా డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. అయితే ఇక రీసెంట్ టైమ్స్ లో వేణు స్వామి చెప్పిన ఏ జాతకం కూడా నిజం అవ్వలేదు. ఇకపై నేను జాతకాలు ఆపేస్తాను అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ రీసెంట్ గా నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత వారి గురించి జాతకం చెప్పడం మొదలుపెట్టాడు.
ఈ జాతకం తీవ్ర చర్చలకు దారితీసింది. అయితే వేణు స్వామి(Venu Swami) భార్య వీణా శ్రీవాణి దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు వీణతోపాటే యూట్యూబ్ వీడియోస్ లో సోషల్ మీడియాలో కనిపించే శ్రీవాణి. ఇక రీసెంట్ టైమ్స్ లో తన భర్తను ప్రొటెక్ట్ చేస్తూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటూ ఈమె పెడుతున్న వీడియోస్ కి అన్నీ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వెతికి చూసిన కూడా ఒక పాజిటివ్ కామెంట్ కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే అసలు వేణు స్వామి పైన ఎంత నెగెటివిటీ ఉందో అర్థం అవుతుంది.
ఇకపోతే వేణు స్వామిని మాత్రమే కాకుండా ఇప్పుడు వీణాను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది నెటిజన్స్. ఒకప్పుడు శ్రీవాణి వీణ వాయిస్తున్న వీడియోలను స్టేటస్లు కూడా పెట్టుకునేవాళ్ళు. తన మ్యూజిక్ వీడియోస్ ని చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈమె సైలెంట్ గా వీణ వాయించుకోవడం చాలా బెటరు, ఈమె నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థం అవుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రీసెంట్ గా వేణు స్వామిని వెనకేసుకుని రావడం మాత్రమే కాకుండా నాగచైతన్య శోభిత నాకు గిఫ్ట్స్ కావాలి అంటూ రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టింది.