Bhumika Chawla : భూమికా చావ్లా సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలుసా?

Bhumika Chawla : టాలీవుడ్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రత్యేకంగా పాత్రల్లో నటిస్తూ తమ అభిమాలను ఖుషి చేస్తున్నారు. అందులో భూమిక కూడా ఒకరు.. చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఆమె బర్త్ డే సందర్బంగా ఆ కేరీర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈమె అసలు పేరు రచనా చావ్లా. 1978 ఆగస్టు 21న న్యూఢిల్లీలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి భిన్నంగా కనిపించాలని తపించేవారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్ మూవీస్ లో నటించింది భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా రంగానికి పరిచయమయ్యారు.. ఆ సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

భూమికా సినిమాలు..

భూమిక మొదటి సినిమా యువకుడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల అవకాశాలను అందుకుంది. నాగార్జున తో స్నేహమంటే ఇదేరా సినిమా చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు ఒక్కడు సినిమా చేసింది. ఎన్టీఆర్ తో సింహాద్రి చేసింది.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదో లేక చెయ్యలేదో కానీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు. ఏది చేసినా భూమిక తెలుగు చిత్రాలతోనే అపూర్వ విజయం సాధించారని చెప్పవచ్చు.

- Advertisement -
Do you know how Bhumika Chawla made her entry into films?
Do you know how Bhumika Chawla made her entry into films?

భూమిక ఈ మధ్య నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ‘మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి’వంటివి ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ప్రముఖ యోగామాస్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడిన తరువాత ‘తకిట తకిట’ అనే తెలుగు చిత్రం నిర్మించారు. ఆ తరువాత రూలర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. పాగల్ లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. గోపీచంద్ ‘సీటీమార్’లోనూ భూమిక ముఖ్యపాత్ర ధరించారు. ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తోన్న ‘సీతారామం’లోనూ భూమిక ముఖ్యపాత్రలో కనిపించారు. ఆ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు