Devara : టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబో రిపీట్ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాస్ మసాలా సినిమాను చూపించబోతున్నాడు డైరెక్టర్.. దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. త్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఈ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఓ స్టార్ హీరో వద్దన్నాడట.. ఆ హీరో ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో దేవర టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. టీజర్, గ్లింప్స్, సాంగ్సే కాదు.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడే సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ నెటింట చక్కర్లు కొడుతుంది. ఈ దేవర సినిమాకు మొదటి చాయిస్ ఎన్టీఆర్ కాదని, మరో హీరోను కొరటాల అనుకున్నాడట.. కానీ ఆ హీరో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ఎన్టీఆర్ కు వచ్చిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? దేవర సినిమాను రిజెక్ట్ చెయ్యడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
దేవర సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో మరెవ్వరో కాదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun ).. అల్లు అర్జున్ 21వ సినిమాగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో పోస్టర్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. గీత ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నట్లు ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.. బన్నీ కూడా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్లో మూవీ రెడీ అయిపోతుందని అంత అనుకున్నారు.. కానీ ఆచార్య సినిమా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ ఈ సినిమాను అల్లు అర్జున్ పక్కనపెట్టి సుకుమార్ కాంబోలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.
పుష్ప 2 సినిమా షూట్ లేట్ అవ్వడంతో కొరటాల శివ సినిమాను హోల్డ్‌లో పెట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ప్రస్తుతం ఈ విషయం నెటింట వైరల్‌గా మారడంతో.. దేవర సినిమాలో మొదట చేయవలసింది తారక్ కాదంటూ.. అల్లు అర్జున్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అని టాక్.. ఇకపోతే అల్లు అర్జున్ పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదన్నమాట.. ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యనున్నాడు.