Megastar Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) పేరే మొదటగా వినిపిస్తుంది. ఈయన సుధీర్గ సినీ ప్రయాణం లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. మరెన్నో రికార్డులు కొల్లగొట్టారు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న చిరంజీవి గురించి అందరికీ తెలుసు. కానీ చిరు అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసిన సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ సినిమా ఏంటో? రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆ రోజుల్లో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ లేదు.. ఎడిటింగ్ తో పెద్దగా పనిలేదు. ఒక సినిమా మొదలైందంటే నాలుగు లేదా ఐదు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అందుకే సినిమా షూటింగ్ కూడా తక్కువ రోజుల్లోనే అయ్యేది. ఒక్క సినిమాకు ఎలా లేదన్న రెండు నెలల ఈజీగా పడుతుంది. కానీ చిరు నటించిన ఓ సినిమాను కేవలం 29 రోజుల్లోనే పూర్తి చేశారట.. అంత తక్కువ రోజుల్లో సినిమానా అని ఆలోచిస్తున్నారు కదా.. అవును నిజమే.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 80వ దశకంలో వచ్చిన చిత్రమిది.. మొదటి షోతో యావరేజ్ టాక్ ను అందుకున్న ఈ షో ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.
అప్పటిలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ( Intlo Ramayya Veedilo Krishnayya ) సినిమాను 29 రోజుల్లో చిత్రీకరించి డైరెక్టర్ కోడి రామకృష్ణ ( Kodi Ramakrishna ) అందరి చేత ఔరా అనిపించారు. గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ అందించిన ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి ( Madhavi ) జంటగా నటించారు. పూర్ణిమ ( Poornima) , గొల్లపూడి మారుతీరావు (Gollapudi Maruthirao) , సంగీత ( sangeetha ), పి. ఎల్. నారాయణ, అన్నపూర్ణ మొదలగు వారు ఈ మూవీలో నటించారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను నిర్మించగా.. జె.వి.రాఘవులు సంగీతం ( JV Raghavulu) అందించారు. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమా.. యావరేజ్ టాక్ తో మొదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 8 కేంద్రాలలో 50 రోజులు.. రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. మొదట పర్వాలేదనిపించిన ఈ మూవీ 517 రోజులు థియేటర్లలో ఆడి రికార్డ్ బ్రేక్ చేసింది.
ఇకపోతే కోడి రామకృష్ణకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కాగా.. గొల్లపూడి మారుతీరావు మాటల రచయిత నుంచి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపిస్తూ తనదైన కామెడితో ఆకట్టుకుంటున్నాడు. ఇక అప్పటిలో ఈ సినిమా సరికొత్త రికార్డ్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. వశిష్ఠ (Vaisista) దర్శకత్వంలో విశ్వంభర ( Viswambhara ) సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ విడుదల కాబోతుంది.