Divyanka – Vivek : రొమాంటిక్ టూర్ కెళ్తే పాస్పోర్ట్, 10 లక్షలు మాయం… పాపం స్టార్ కపుల్

Divyanka – Vivek : వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి యూరప్‌కు వెళ్లిన సెలబ్రిటీ కపుల్ దివ్యాంక త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియాకు జీవితంలో మరిచిపోలేని చేదు అనుభవం ఎదురైంది. వారి పాస్‌పోర్ట్‌లు, రూ. 10 లక్షలు, వ్యాలెట్‌లు, షాపింగ్ చేసిన కొన్ని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. దీంతో ఈ జంట రొమాంటిక్ ట్రిప్ కోసమని వెళ్ళి, విదేశాల్లోనే చిక్కుకున్నారు.

దొంగతనం ఎలా జరిగింది?

దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి యూరప్ కి రొమాంటిక్ ట్రిప్ వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట యూరప్ లోని ఫ్లోరెన్స్‌లో ఉన్నారు. తొలుత యూరప్‌లో సరదాగా గడిపి తమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న తరువాత ఈ జంటకు షాకింగ్ నిజం తెలిసింది. తమ పాస్‌పోర్ట్, పర్సు, రూ.10 లక్షల విలువైన వస్తువులు కన్పించకపోవడంతో కంగు తిన్నారు. అవన్నీ చోరికి గురయ్యాయి అని అర్థం చేసుకుని తేరుకోలేని షాక్ కు గురయ్యారు. ఇప్పుడు దివ్యాంక, వివేక్‌లు పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడంతో యూరప్‌లో ఇరుక్కుపోయారు.

ఈ సంఘటన గురించి వివేక్ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ‘మేము నిన్న ఫ్లోరెన్స్ చేరుకున్నాము. ఒకరోజు ఇక్కడే ఉంటాం అనుకున్నాం. మేము మా బస కోసం హోటల్స్ ను చూడటం ప్రారంభించాము. బయట పార్క్ చేసిన కారులో మా వస్తువులన్నింటినీ వదిలివేసాము. అయితే మేము మా వస్తువులను తీసుకెళ్లడానికి తిరిగి కారు దగ్గరకు వచ్చి చూస్తే ఎవరో కారు అద్దాలను పగులగొట్టి మా వస్తువులన్నింటినీ దొంగిలించారు’ అని ఆవేదనను వ్యక్తం చేశారు.

- Advertisement -

Vivek Dahiya-Divyanka Tripathi Robbed In Florence, Passport And Cash Stolen From 'Secure Location' | Republic World

పోలీసులు సహాయం చేయలేదు

ఈ సంఘటన తర్వాత వివేక్ స్థానిక పోలీసులను సంప్రదించాడు. కానీ వాళ్ళకు అక్కడి పోలీసుల నుంచి ఎటువంటి సహాయం లభించలేదు. వివేక్ మాట్లాడుతూ “మేము స్థానిక పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించాము. కానీ వారు సహాయం చేయడానికి నిరాకరించారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మాకు సహాయం చేయడం కుదరదన్నారు. అప్పుడు మేము ఇండియన్ ఎంబసి  కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రయత్నించాము. కానీ అప్పటికి ఆ ఆఫీసు క్లోజ్ అయ్యింది” అని తెలిపారు.

ఇప్పుడు ఈ జంట తిరిగి ఎలా వస్తుంది?

వివేక్ ఇంకా మాట్లాడుతూ “ఫ్లోరెన్స్ దగ్గర ఒక చిన్న పట్టణం ఉంది. మేము అక్కడ నివసిస్తున్నాము. హోటల్ సిబ్బంది మాకు చాలా సహాయం చేస్తున్నారు. కానీ మాకు ఎంబసీ సహాయం కావాలి. భారతదేశానికి తిరిగి రావడానికి మాకు తాత్కాలిక పాస్‌పోర్ట్ అవసరం. ఎంబసీ సహాయంతో మాత్రమే దానిని పొందగళం. ఇప్పుడు మా దగ్గర నగదు కూడా లేదు” అంటూ హెల్ప్ కోరారు.

అసలు ఈ జంట ఎవరు?

హిందీ టెలివిజన్ నటి దివ్యాంక తన ‘యే హై మొహబ్బతే’ సహ నటుడు వివేక్‌ను 2016 జూలై 86న భోపాల్‌లో వివాహం చేసుకుంది. దివ్యాంక 2004 రియాల్టీ షో ‘ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్’లో, 2006 షో ‘బానూ మైన్ తేరీ దుల్హన్’లో నటించి పాపులర్ అయ్యింది. ‘ఖానా ఖజానా’, ‘నాచ్లే వే విత్ సరోజ్ ఖాన్’, ‘జోర్ కా ఝట్కా: టోటల్ వైపౌట్’, ‘కామెడీ సర్కస్’, ‘నాచ్ బలియే 8’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11 వంటి షోలలో పోటీదారుగా ఉన్నారు. వివేక్ ‘ఏక్ వీర్ కి అర్దాస్…వీరా’, ‘యే హై ఆషికి’ మరియు ‘కవచ్’ వంటి షోలలో భాగమయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు