Dil Raju : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు రాజు. అతి తక్కువ టైంలోనే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను చూసి తన జడ్జిమెంట్ కి ఒక వ్యాల్యూ సాధించుకున్నారు. ఎంతోమంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి ఉంది. సుకుమార్ వంటి పాన్ ఇండియా దర్శకులు కూడా పరిచయమైంది దిల్ రాజు బ్యానర్ లోనే.
ప్రస్తుతం దిల్ రాజు గేమ్ చేంజర్(Game Changer) అనే సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా చేస్తున్న ఈ సినిమా గత ఆరు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కాలేదు. ఈ సినిమా డిసెంబర్ లో అవుతుంది అంటూ దిల్ రాజు అధికారికంగానే ప్రకటించారు. ఇకపోతే సరిపోదా శనివారం సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు ఈ సందర్భంగా ప్రెస్మీట్ కి హాజరయ్యారు దిల్ రాజు.
ఈ సందర్భంగా దిల్ రాజు ఒక ప్రముఖ జర్నలిస్టుకి సమాధానం ఇస్తూ మేము చేసిన తప్పేంటో మాకు అర్థమైంది. దాని గురించి అందరం కలిసి సరైన నిర్ణయం తీసుకుంటాము. ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడానికి మేము కూడా ఒక కారణం అంటూ ఒప్పుకున్నారు. ఆ బిజినెస్ కోసం ఓటీటీ కి సినిమాలు ఇచ్చేస్తాము. కేవలం నాలుగైదు వారాల్లో సినిమా ఓటీటీలకు వచ్చేస్తుంది కాబట్టి థియేటర్ కి రావటానికి ఆడియన్స్ ఇష్టపడటం లేదు. అతి త్వరలోనే మళ్లీ ఆడియన్స్ను థియేటర్స్ కు తెప్పించే ప్రయత్నం చేస్తాము టికెట్ విషయంలో కూడా మేమంతా కలిసి ఒక క్లారిటీ తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు.