Devara VS Bhaira : టాలీవుడ్ లో కల్కి2898AD తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. మధ్యలో పాటలు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన బర్త్ డే సందర్బంగా దేవర మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
దేవరతో భైరా తలపడేది ఇక్కడే..
ఇక సైఫ్ అలీఖాన్ (Saif ali khan) బర్త్ డే సందర్బంగా దేవర మేకర్స్ సైఫ్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ‘భైరా’ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భైరా పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అందులో భైరా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆ వీడియోలో భైరా ఉన్న ఒక షాట్ ని చూపించారు మేకర్స్. చూస్తుంటే ఆ షాట్ లో భైరా పోరాడి, దెబ్బలు తగిలి, అలిసి పడి ఉన్నాడు. అయితే ఆ సీన్ చుట్టూ ఉన్న ప్లేస్ ని గమనిస్తే… ఆ సీన్ లో దేవరతోనే భైరా తలపడినట్టు తెలుస్తుంది. మేకర్స్ నుండి అనుకోకుండా లీక్ అయిందని అనుకోవచ్చు. అదెలా అంటే, కొన్ని నెలల కింద దేవర ని దసరా కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇవ్వగా… ఆ పోస్టర్ లో దేవర ఒక మోకాలు కింద పెట్టినట్టు, ఇసుకలో ఉన్న సీన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు భైరా టీజర్ లో ఉన్న చోటు కూడా అదే. ఈ సీన్ లోనే వీళ్ళిద్దరూ తలపడతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
షూట్ మొత్తం పూర్తయినట్టే…
ఇక దేవర (Devara) రిలీజ్ డేట్ విషయంలో అభిమానులు ఇప్పటివరకు సందిగ్ధం లో ఉండగా, రీసెంట్ గా ఓ ట్వీట్ తో ఫాన్స్ ని కూల్ చేసాడు తారక్. షూటింగ్ ఫినిష్ అయిందని తారక్ ఆ ట్వీట్ లో చెప్పేసాడు. ఇక తారక్ షూటింగ్ గురించిన ఈ విషయాన్నీ నైట్ షూట్ సెటప్ లో ఎన్టీఆర్ – కొరటాల శివ తో సెట్స్ లో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాతో జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 ఫైనల్ గా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.