Devara Trailer Talk.. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.. హై వోల్టేజ్ యాక్షన్ , మాస్ పర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ ఇరగదీసారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండవసారి చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టిన చిత్ర బృందం అందులో భాగంగానే.. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చాలా ఘనంగా నిర్వహించారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది అభిమానులు థియేటర్ లు అభిమానుల చప్పట్లు , ఈలలతో దద్దరిల్లిపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దేవర నుంచి విడుదలైన ఈ ట్రైలర్ చూసిన తర్వాత నెటిజన్స్ నుంచి వస్తున్న స్పందన ఏంటి..? అసలు ఈ సినిమా ప్లస్, మైనస్ ఏంటి .?అసలు ఈ ట్రైలర్ టాక్ ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముందుగా ట్రైలర్ విషయానికి వస్తే.. సంద్రాన్ని చూపిస్తూ.. అసలు “ఎవరు వాళ్లంతా” అంటూ ఆత్రుతగా ప్రశ్నించే డైలాగ్ తో అజయ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.” కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి” అంటూ ప్రకాష్ రాజ్ చాలా అద్భుతంగా డైలాగ్ చెబుతూ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ట్రైలర్ ను చూపించారు. సానా పెద్ద కథ సామీ.. “రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవరా కథ..” అంటూ డైలాగ్స్ తోనే ఇరగదీసేశారు. ఇకపోతే ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో తండ్రి పాత్రలో ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతుంటే, కొడుకు పాత్రలో పిరికివాడిలా కనిపించి అభిమానులను నిరాశకు గురి చేశారు. మరి ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
దేవర ట్రైలర్ ప్లస్ పాయింట్స్..
•మరొకసారి ఎన్టీఆర్ తన యాక్షన్ పర్ఫామెన్స్ తో హై వోల్టేజ్ చూపించేశారు.
•అనిరుద్ రవిచంద్రన్ అందించిన బీజీఎం సినిమాకు ప్లస్ కానుంది.
•గ్లామర్ లుక్కులోనే కాదు పల్లెటూరి అమ్మాయిగా కూడా చాలా అందంగా కనిపించింది జాన్వీ
•క్లైమాక్స్ లో సొర చేప చూపించి.. యాక్షన్ సన్నివేషాలతో అదుర్స్ అనిపించారు..
•అదిరిపోయే డైలాగ్స్..
దేవర ట్రైలర్ మైనస్ పాయింట్స్..
•కొడుకు పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ పిరికివాడిగా కనిపించడం అభిమానులకు నచ్చలేదు..
•ఆచార్య నుంచి కొరటాల శివ బయటకు రాలేదు అనిపించింది.
* అదుర్స్ సినిమాలో అన్నదమ్ముల క్యారెక్టర్ లను.. ఇక్కడ తండ్రి కొడుకులుగా రిపీట్ చేశాడు..
•జాన్వీ పర్ఫామెన్స్ రంగస్థలంలో సమంత పర్ఫామెన్స్ లా అనిపించింది..
* RRR ఎలివేషన్స్ లా అనిపించాయి.