DEVARA Trailer Talk : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ట్రైలర్ ఎట్టకేలకు యూట్యూబ్ లో కాసేపటికింద విడుదలై ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. RRR తర్వాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేయగా, తాజాగా దేవర (DEVARA) థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై నిమిషాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో దేవర ట్రైలర్ కి బాగానే రెస్పాన్స్ వస్తుంది. కానీ తెలుగు ఆడియన్స్ లో మాత్రం దేవరపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవరపై ట్రోలింగ్.. ఆంధ్రావాలా అప్డేటెడ్ వెర్షన్..
కాసేపటికిందే రిలీజ్ అయిన దేవర ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా, ట్రైలర్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు కొరటాల (Koratala Shiva) ఎలివేషన్ల పైనే దృష్టి పెట్టాడుగాని, కథపై ఫోకస్ చేయలేదన్న మాట వినిపిస్తుంది. పైగా దేవరను వేరే సినిమాలతో పోల్చుతున్నారు నెటిజన్లు. అభిమానులు కూడా కొత్తగా చుపిస్తారనుకుంటే, రొటీన్ కథనే మళ్ళీ తీసాడని కొరటాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైలర్ లో ఎన్టీఆర్ (Jr NTR) రెండు పాత్రల్ని గమనిస్తే, ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా (Andhrawala) సినిమానే మళ్ళీ తీసాడని కామెంట్స్ వస్తున్నాయి. అందులో కూడా ఎన్టీఆర్ తన తండ్రి పాత్రని ముందుగా అపార్ధం చేసుకుంటాడు, తర్వాత తెలుసుకుంటాడు. అలాగే దేవర లో కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేసారని కామెంట్స్ వస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్రావాలా కి అప్డేట్ వెర్షన్ గా దేవరని తీసారని కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ కొరటాల శివ ఆ కథకి ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా తీసినా, తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు.
ట్రైలర్ కిక్ సరిపోదు సామి?
ఇక దేవర ట్రైలర్ ని చూసిన మరికొందరు నెటిజన్లు అదుర్స్ (Adurs) లో ఎన్టీఆర్ పాత్రల్ని మళ్ళీ రీ క్రియేట్ చేసారని, ఎన్టీఆర్ ని మళ్ళీ అమాయకంగా చూపించారని అంటున్నారు. ఎన్టీఆర్ ని అలా చూపించడం ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. అయితే ట్రైలర్లో ఎలివేషన్లకేమి డోకా లేదు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ సాలిడ్ గా ఉండగా, దానికితగ్గట్టు అనిరుద్ బీజీఎమ్ కూడా బాగుంది. అలాగే జాన్వీ కపూర్ (Janvi Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) పాత్రల్ని కూడా ట్రైలర్ లో బాగానే చూపించారు. అయితే దేవర ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కి అంతగా కిక్కివ్వలేదన్న మాట వినిపిస్తుంది. మరి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ ని ఏమైనా చుపిస్తారేమో చూడాలి.