Devara Tickets : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సమయం ఆసన్న మైంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ( ntr) చేస్తున్న సినిమా దేవర ( Devara) సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటీ వరకు ప్రీ బుకింగ్స్ భారీగానే జరిగాయి. కానీ ఇప్పుడు టికెట్స్ బుకింగ్ తగ్గిందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకు కారణం మేకర్స్ వదిలిన అప్డేట్స్.. నిన్న ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ యాంటి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక దేవర ఓవర్సీస్ బుకింగ్ కూడా తగ్గినట్లు తెలుస్తుంది. దేవర ప్రీ బుకింగ్ డిటైల్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
దేవర ట్రైలర్ రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో దేవర సంచలనాలు మొదలయ్యాయి. ఓవర్సీస్ ప్రీ సేల్ టికెట్స్ బుకింగ్ లో వన్ మిలియన్ మార్క్ ను వేగంగా అందుకున్న సినిమాగా దేవర మూవీ నిలవడం గమనార్హం. ఇప్పుడు ఇంక అక్కడ పెరిగినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం దేవర పేరు ట్రెండింగ్ లో ఉండగా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్ ద్వారా వేగంగా ట్రైలర్ రిలీజ్ కు ముందే వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా దేవర రికార్డులకెక్కింది.. ఇది ఎన్టీఆర్ కు మరో రికార్డ్ అనే చెప్పాలి..
ఇలా ప్రీ బుకింగ్స్ గతంలో ఏ ఇండియన్ సినిమాలు రాలేదు. దేవర (Devara) రిలీజ్ కు ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ లెక్కలు మారిపోవడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న కొత్త పొస్టర్లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది..
ట్రైలర్ ఎఫెక్ట్.. అక్కడ బుకింగ్స్ తగ్గాయా?
దేవర సినిమా ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. విడుదలకు తక్కువ సమయం ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. ముందుగా ముంబైలో ప్రమోషన్స్ స్పీడును పెంచేసింది. ఈ క్రమంలో నిన్న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో సన్నివేశాలు కొన్ని ఆంధ్రావాలా సినిమా లాగా ఉన్నాయానే ట్రోల్స్ మొదలయ్యాయి. ట్రైలర్ విడుదల అయ్యాక సీన్ రివర్స్ అయ్యిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో టికెట్స్ బుకింగ్ తగ్గిందని ఓ వార్త షికారు చేస్తుంది. నిన్నటివరకు బాగానే ఉన్నా కూడా ఇప్పుడు బుకింగ్స్ తగ్గిందని తెలుస్తుంది. అటు ఇండియాలో కూడా బుకింగ్స్ దారుణంగా పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి రికార్డ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..