Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ట్రైలర్ ఎట్టకేలకు యూట్యూబ్ లో విడుదలై ట్రెండ్ అవుతుంది. కాసేపటికిందే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ నెట్టింట నిమిషాల వ్యవధిలోనే టాప్ లో ట్రెండ్ అవుతుంది. అయితే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక దేవర ట్రైలర్ ని చిత్ర యూనిట్ ముంబైలో లాంచ్ చేసారు. అయితే దేవర ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకున్నారు నందమూరి అభిమానులు.
రికార్డు మిస్ అయిన దేవర..
ఇక కాసేపటికిందే రిలీజ్ అయిన దేవర ట్రైలర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. నెట్టింట దేవర (Devara) ట్రైలర్ పై ముందునుండే ఓ రేంజ్ లో అంచనాలుండగా, కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయమని అనుకున్నారు. కానీ స్టార్ బాగానే చేసిన దేవర, రికార్డులు మిస్ అయింది. అన్నిటికంటే ముందు ఫాస్టెస్ట్ 100k లైక్స్ కొడుతుందని అనుకున్నా, మిస్ అయింది. దేవర ట్రైలర్ రిలీజ్ అయిన 9 నిమిషాల్లో 100k లైక్స్ ని అందుకుంది. అయితే ఫాస్టెస్ట్ 100k లైక్స్ లో సలార్ ట్రైలర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సలార్ ట్రైలర్ 3 నిముషాల్లోనే లక్ష లైక్స్ అందుకుంది.
24 గంటల రికార్డయిన కొడుతుందా?
ఇక దేవర ట్రైలర్ 100k పరంగా 9 నిమిషాల్లో అందుకోగా, మొదటి స్థానంలో సలార్ (Salaar) ట్రైలర్ 3 నిమిషాల్లో అందుకోగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా, భీమ్లా నాయక్ (4 మినిట్స్), వకీల్ సాబ్ (7 మినిట్స్), కల్కి2898AD (7మినిట్స్), RRR (8 మినిట్స్), సర్కారు వారిపాట (9 మినిట్స్), ఆది పురుష్ (9 మినిట్స్) ఉండగా, వీటి తర్వాతే దేవర ఉంది. అంటే ఎన్టీఆర్ దేవర కంటే ముందు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాలున్నాయి. మరి యూట్యూబ్ లో వ్యూస్ పరంగా భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న దేవర 24 గంటల రికార్డుల్లో అయినా ఎంత వరకు కొత్త రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.