Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ట్రైలర్ ఎట్టకేలకు యూట్యూబ్ లో విడుదలై ట్రెండ్ అవుతుంది. నిన్న సెప్టెంబర్ 10న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ నెట్టింట నిమిషాల వ్యవధిలోనే టాప్ లో ట్రెండ్ అయింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ముంబైలో నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ట్రైలర్ లాంచ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించగా, అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక దేవర ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని, సినిమాపై పదింతలు అంచనాలు పెంచుతుందని నందమూరి అభిమానులు భావించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు మొత్తం తలకందులయ్యాయి.
ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయిన దేవర…
ఇక ఎన్టీఆర్ (Jr NTR) దేవర ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేయగా, భారీ వ్యూస్, లైక్స్ వస్తాయని అనుకున్నా, ఎప్పుడైతే 100k లైక్స్ మిస్ అయిందో అప్పుడే దేవర ట్రైలర్ పై దెబ్బపడింది. ఇక 24 గంటలు ముగిసే సరికి దేవర ఓవరాల్ గా 10.38M మిలియన్ల వ్యూస్ ని, 658.8K లైక్స్ మాత్రమే సాధించింది. ఇది ఒక పాన్ ఇండియా సినిమాకి రావాల్సిన రికార్డు కాదని చెప్పాలి. దీనికంటే ముందు కూడా మీడియం రేంజ్ స్టార్ హీరోల సినిమాలున్నాయంటే దేవర (Devara) ఎంత వెనకబడి ఉందో తెలుస్తుంది.
దారుణమైన దెబ్బ ఇది…
ఇక ట్రైలర్ రికార్డ్స్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న సినిమాల్లో RRR (1.24M) టాప్ లో ఉంది. ఆ తర్వాత వరుసగా సలార్ (1.23M), సర్కారువారి పాట (1.2M), భీమ్లానాయక్ (1.11M), వకీల్ సాబ్ (1.6M), పుష్ప(893K), ఆచార్య(838K) టాప్ లో ఉన్నాయి. దేవర ఓవరాల్ గా పన్నెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వ్యూస్ పరంగా అయితే అంతకంటే దారుణం అని చెప్పాలి. వ్యూస్ లో టాప్ లో గుంటూరు కారం (37M), సలార్ – (32.58M), సర్కారువారి పాట (26.77M), రాధే శ్యామ్ (23.20M), ఆచార్య (21.86M), బాహుబలి ట్రైలర్ (21.81M) ఉన్నాయి. ఇక దేవర అయితే 10. 38 మిలియన్ల వ్యూస్ తో ఎక్కడో అట్టడుగున 30వ స్థానంలో నిలిచింది. దేవర యూట్యూబ్ రికార్డుల పరంగా వెనుకబడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. మరి రెండో ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తే, అప్పుడైనా ఏమైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి.