Devara: ఎన్నో అంచనాలు మిస్ అయ్యాయి, రాజమౌళి సెంటిమెంట్ కి ఇక బ్రేక్ పడనట్లే

Devara: మిర్చి(Mirchi) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఆచార్య(Acharya) సినిమాతో మొదటిసారి డిజాస్టర్ ని చూశాడు. ఆ సినిమా తర్వాత చాలా లోతుకి వెళ్లిపోయాడు కొరటాల శివ(Koratala Siva). కొంతకాలం పాటు బయట కూడా కనిపించలేదు. ప్రస్తుతం కొరటాల దేవర అనే పాన్ ఇండియా సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి

టెంపర్ సినిమా తర్వాత వరుసగా సక్సెస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎన్టీఆర్(Ntr). డిజాస్టర్ డైరెక్టర్ తో చేయి కలిపినా కూడా మంచి హిట్ సినిమాలను పొందుకుంటున్నాడు. ఇకపోతే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాబి తో సినిమా చేసి జై లవకుశ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అక్కడితో బాబీ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసి బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ చేసిన సినిమా అది. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇలా కేవలం ఒకరిద్దరి దర్శకులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో చేసిన ప్రతి దర్శకులు కూడా అద్భుతమైన హిట్ సినిమాలు చేశారు.

రాజమౌళి హీరో సెంటిమెంట్

ఇకపోతే ఎప్పటినుంచో రాజమౌళి హీరో సెంటిమెంట్ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది. అంటే రాజమౌళితో ఒక హీరో సినిమా చేసిన తర్వాత ఆ హీరో ఏ దర్శకుడు తో చేసిన కూడా ఆ సినిమా ఫెయిల్ అవుతూ వచ్చింది. రామ్ చరణ్, సునీల్, నాని ఇలా ఎంతోమంది హీరోలు రాజమౌళితో పనిచేసే సక్సెస్ కొట్టిన తర్వాత సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఎన్టీఆర్ కి కూడా మరోసారి జరగనుంది. ఇదివరకే ఎన్టీఆర్ రాజమౌళితో మూడుసార్లు కలిసి పనిచేశాడు. అయితే రాజమౌళితో పనిచేసిన తర్వాత ఇంకో దర్శకుడు తో సినిమా చేసిన ప్రతిసారి డిజాస్టర్ మూట కట్టుకున్నాడు ఎన్టీఆర్.

- Advertisement -

Devara

అంచనాలు మిస్ అయ్యాయి

ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రీసెంట్ గానే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ చూడటానికి బాగానే ఉన్నా కూడా ఊహించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు అని చెప్పాలి. దీనితో చాలామంది ఆల్రెడీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఈసారి కూడా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం లేనట్లు ఉంది అని ఫిక్స్ అయిపోయారు. ఏదేమైనా ఈ సినిమా తుది ఫలితం వచ్చినప్పుడే రాజమౌళి సెంటిమెంటుకు కొరటాల శివ చెక్ పెట్టాడా లేదా అనేది తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు