Jr NTR : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR ) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు. ఎన్టీఆర్ కొరటాల (Koratala )తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ (Janatha Gyarej) వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ రాబుతుండటంతో అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రిలీజ్ కు అతి తక్కువ రోజులే ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్ స్పీడు పెంచేసింది. ఈ క్రమంలో రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అది విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది.
అదేంటంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ ను ముందుగా ముంబై నుంచే మొదలు పెట్టారు దేవర టీమ్.. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ను కూడా ముంబైలోనే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్నా అని, చాలా నర్వస్‌గా ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ మూవీతో చివరగా వచ్చాను. అందులో రామ్ చరణ్ మరో హీరో. ఇప్పుడు సోలో హీరోగా దేవర సినిమా చేస్తున్నా. ఆరేళ్ల తర్వాత సోలోగా నా మూవీ వస్తుందంటే కాస్త నర్వస్‌గా ఉందని చెప్పారు ఎన్టీఆర్.. ఆ సమయంలో అక్కడ ముందు వరుసలో ఉన్నవాళ్ళంతా ఎన్టీఆర్ అభిమానులు కాదని ఓ జర్నలిస్ట్ చెప్పాడు. అతను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ముంబైలో దేవర ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు జై ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. అయితే వారంతా నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కాదని బాంబ్ పెల్చాడు.. వారంతా ఫెయిడ్ ఆర్టిస్టులు అని సంచలన విషయాలను ఆయన బయట పెట్టాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పెయిడ్ ఆర్టిస్టులతో సెల్ఫ్ డబ్బా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక దేవర` చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అనిరూద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటివరకు వరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సినిమా ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి..