Devara : సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ‘దేవర’పై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్ కనీసం రికార్డు బ్రేకింగ్ వ్యూస్ రాబట్టలేకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. పైగా తాజాగా దేవర ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూసి ఇది మరో ఆచార్య కాబోతోందా? అని టెన్షన్ పడుతున్నారు. మరి ఆ రిజల్ట్ ఏంటి ? అసలు దేవరపై ఎందుకింత ట్రోలింగ్ జరుగుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్
ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. అయితే దేవరతో ఆ మూవీ తెచ్చిన నెగెటివిని బ్రేక్ చేసి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకున్నాడు. పలు అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు దేవర మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27 న దేవరను థియేటర్లలోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో కొరటాల ఈ మూవీ ప్రమోషన్లలో జోరు పెంచారు. అందుకే గ్రాండ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కానీ మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన దేవర ట్రైలర్ కు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆహా, ఓహో అన్నప్పటికీ మూవీ లవర్స్ ను మాత్రం ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నెటిజన్లు అయితే ఓ రేంజ్ లో కొరటాలను ఆడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడిచిపోవడంతో వచ్చిన వ్యూస్, లైక్స్ సంఖ్య బుర్ర కరాబ్ చేస్తోంది. ఆచార్యతో పోలిస్తే దేవర పరిస్థితి ఇంకా దారుణంగా ఉందా ? అనే అనుమానం కలిగిస్తోంది. చిరు, చరణ్ లతో కొరటాల రూపొందించిన ఆచార్య మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 21.86 మిలియన్ వ్యూస్, 838K లైక్స్ వచ్చాయి. కానీ దేవర ట్రైలర్ కు మాత్రం రిలీజైన 24 గంటల్లో కేవలం 10.37 మిలియన్ వ్యూస్, 658K లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే దేవర రిజల్ట్ ఆచార్య కంటే దారుణంగా ఉండబోతోందా ? అనే కంగారును పుట్టిస్తోంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు
ఆర్ఆర్ఆర్ తరువాత ఆరేళ్లకు సినిమా రిలీజ్ అవుతుండడంతో కాస్త నెర్వస్ గా ఉంది అని దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పడం, ఇప్పుడు ట్రైలర్ కు ఇంత నెగెటివ్ రెస్పాన్స్ రావడం చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుడుతోంది. పైగా రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. ఆయనతో సినిమా చేశాక ఒక్క హీరోకి కూడా హిట్ పడలేదు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత తారక్‌కి ఇదే తొలి చిత్రం కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క దేవరపై కొరటాల జీరో ఎఫర్ట్స్ పెట్టారు అంటూ ఆచార్య నుంచి దేవరలో కొరటాల దించిన కాపీ సీన్స్ ను స్క్రీన్ షార్ట్స్ తో సహ పెట్టి ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ ఈ సినిమా గనుక నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే అటు కొరటాలపై ఎఫెక్ట్ పడడం మాత్రమే కాదు ఇటు రాజమౌళి సెంటిమెంట్ కూడా నిజం అని మరోసారి ప్రూవ్ అవుతుంది.