Devakatta : నా పాయింట్ అఫ్ వ్యూ లో నాని హీరో కాదు , స్టార్ కాదు

Devakatta : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇదివరకే వీరి కాంబినేషన్లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం మళ్ళీ అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఒక సెన్సిటివ్ ఫిలిమ్స్ తీసే డైరెక్టర్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తే ఎలా ఉండబోతుందో అని ఈ సినిమా చూస్తే అర్థమయ్యేటట్టు ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్లో దర్శకుడు దేవకట్ట మాట్లాడుతూ నా దృష్టిలో నాని హీరో కాదు, స్టార్ హీరో కాదు థర్డ్ రో లో కూర్చున్న ఒక ప్రేక్షకుడు అంటూ చెప్పుకోవచ్చు. ఒక దర్శకుడు కథని చెప్పినప్పుడు అలానే వింటాడు. ఆ కథ సినిమాగా మారినప్పుడు అలానే చూస్తాడు. అందుకే నాని ప్రతి సినిమాకి ఆడియన్స్ పెరుగుతూనే ఉంటారు. నాని కొత్త దర్శకులను పరిచయం చేస్తూనే ఉంటాడు. నాని ఒక ట్రెజర్ హంటర్ అంటూ చెప్పుకొచ్చాడు దేవకట్ట.

Saripodhaa Sanivaaram

- Advertisement -

ఇకపోతే నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ మొదలుపెట్టిన నాని. నటుడుగా కూడా సక్సెస్ అవుతూ తనకంటూ ఒక స్టార్ డం క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో నాని చేసిన ప్రతి సినిమా కూడా ఒకదానిని మించి ఒకటి ఉంటుంది. అందుకోసమే నాని సినిమా అంటే ఏమీ ఆలోచించకుండా థియేటర్కు వెళ్లిపోయి ఆడియన్స్ కూడా మొదలయ్యారు. ఇప్పుడు అందరు అంచనాలు సరిపోదా శనివారం సినిమా పైన ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు