Deepika Padukone : భర్తతో కలిసి కల్కిని వీక్షించిన దీపిక… రణ్వీర్ రివ్యూ ఇదే

Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు కల్కి టీం అంతా ఇప్పుడు సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్, దీపికాతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ సినిమా కనీవినీ ఎరుగని విధంగా కల్కి మూవీ తెరకెక్కడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు పలువురు బడా స్టార్స్ కూడా థియేటర్లలో కల్కి మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా దీపికా తన భర్తతో కలిసి కల్కిని వీక్షించింది. సినిమాను చూశాక రణవీర్ సింగ్ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది.

కల్కిపై రణవీర్ రివ్యూ

నిన్న రాత్రి దీపికాతో కలిసి రణవీర్ ముంబైలో కల్కి మూవీని వీక్షించారు. ఆ తరువాత రణ్‌వీర్ సోషల్ మీడియాలో ‘కల్కి 2898 AD’పై ప్రశంసల వర్షం కురిపించాడు. “కల్కి 2898 @kalki2898ad—ఒక గొప్ప సినిమా. బిగ్ స్క్రీన్ సినిమా అంటే అదే! సాంకేతికతను పూర్తిగా వాడుకోవడంలో అపూర్వమైన స్థాయి నైపుణ్యం. ఇండియన్ సినిమాలో చాలా బెస్ట్. నాగి సర్ & టీమ్‌కి అభినందనలు! అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు.

Ranveer Singh Reviews Kalki 2898 AD: Calls It 'Best in Indian Cinema' After Watching It with Deepika Padukone - Entertainment

- Advertisement -

ప్రభాస్, కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ “రెబల్ స్టార్ రాక్! ఉలగనాయగన్ ఎప్పటికీ సర్వోన్నతుడు!” అంటూ ఇద్దరు స్టార్స్ ను ఆకాశనికెత్తేశారు రణవీర్. అమితాబ్ బచ్చన్ పట్ల విస్మయం చెందాడు. “మీరు నాలాంటి అమితాబ్ బచ్చన్ అభిమాని అయితే దీన్ని మిస్ కాలేరు!” తాను కూడా బిగ్ బీకి ఫ్యాన్ అనే విషయాన్ని వెల్లడించారు. ఇక చివరగా తన భార్య దీపిక గురించి ప్రస్తావిస్తూ “నా బేబీ విషయానికొస్తే దీపికా పదుకొనే మీరు ప్రతి క్షణాన్ని మీ దయ, గౌరవంతో ఎలివేట్ చేస్తారు. అంత గంభీరత, ఇంత కవిత్వం, అంత శక్తి. మీరు పోల్చడానికి మించినవారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ దీపికాపై తన ప్రేమను వ్యక్తం చేశారు. మొత్తానికి పేరు పేరునా కల్కి టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు రణవీర్, దీపికా కలిసి కల్కి మూవీని చూసిన ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి.

Parents-to-be Deepika-Ranveer watch 'Kalki 2898 AD' with family - India Today

ఇప్పటిదాకా కల్కిని చూసిన స్టార్స్

కల్కి మూవీని మొదటి రోజే చాలామంది స్టార్స్ చూశారు. పవన్ తనయుడు అకిరా నందన్, ప్రభాస్ సోదరీమణులు, నిర్మాత అశ్వని దత్ కూతుర్లు, అమితాబ్ తన కొడుకు అభిషేక్ తో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అంతేకాదు విజయ్ దేవరకొండ, రష్మిక తదితరులు కూడా ఈ సినిమాను చూడగా, వీళ్ళతో పాటు సూర్య, రజినీకాంత్ లాంటి స్టార్స్ సైతం సోషల్ మీడియా వేదికగా తమ కల్కి అదుర్స్ అంటూ జడ్జిమెంట్ ఇచ్చేశారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఇదే. ప్రతి సినిమాతో ప్రభాస్ తన స్టామినాను మరింత పెంచుకున్నారు. ‘కల్కి 2898 AD’తో మరోసారి తన స్టార్‌డమ్‌ని, క్రేజ్‌ని పెంచుకున్నాడు. నాగ్ అశ్విన్ విజన్, టేకింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు