DCM Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలు చేయడంలో ఆసక్తిని కొంతమేరకు తగ్గించుకున్నారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. వరుసగా ఏడు హిట్ సినిమాలు చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం హీరో గానే కాకుండా పవన్ కళ్యాణ్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. కొత్త దర్శకులతో పనిచేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అలానే చాలా ఫైట్స్ ని సాంగ్స్ ని కూడా కొరియోగ్రఫీ చేస్తుంటారు పవన్ కళ్యాణ్. ఖుషి(Khushi) సినిమా ఒరిజినల్ కంటే కూడా రీమేక్ ఏ అంత అద్భుతంగా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ సాంగ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2024 లో అధికారాన్ని చేపట్టి డిప్యూటీ సీఎం గా నేడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో సినిమాలకు టైమ్ ఇవ్వటం లేదు పవన్ కళ్యాణ్. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా మూడు ఉన్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా ఇంకా రాజకీయాల్లోనే కొనసాగుతాడని చాలామందికి ఇప్పటినుంచి అనుమానాలు మొదలయ్యాయి.
నెక్స్ట్ లెవెల్ డెడికేషన్
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఉన్న డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఎడిటర్ తో పాటు ఎడిట్ రూమ్ లో కూర్చుని ఎడిట్ చేసేవాడు. ఖుషి సినిమాకు సంబంధించి ఒక చైనీస్ ఫైట్ ని పవన్ కళ్యాణ్ మాత్రమే షూటింగ్ చేసుకొని వచ్చి, ఎడిటర్ మార్తాండకే వెంకటేష్(Marthanda K Venkatesh) తో ఏడు రోజులు పాటు కూర్చుని ఎడిటింగ్ చేయించాడు. అలానే తమ్ముడు సినిమాలో కుండలు పగలగొట్టే షాట్ ఒకటి ఉంటుంది. అయితే ఆ కుండలు చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ మామూలుగా పగలగొడతాడు. కానీ పర్టికులర్ గా ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కుండలు పగలకొట్టడానికి కష్టపడాల్సి వచ్చింది.
దానికి కారణం ఏంటి అని మార్షల్ ఆర్ట్స్ వాళ్ళని పిలిపించి అడిగాడు. దానికి వాళ్లు సమాధానంగా ఆ కుండ కెమెరాలు కనిపించటానికి బయట ఫెవికాల్స్ వంటివి ఏవో రాసారు అందువల్లనే అది కొంచెం గట్టిగా ఉంది అందువల్లనే మీరు కష్టపడ్డారు అని వాళ్ళు చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కి సినిమా మీద ఒకప్పుడు ఎటువంటి డెడికేషన్ ఉండేదో అర్థమవుతుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎడిటర్ మార్తాండ కే వెంకటేష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయిన కూడా సరిగ్గా సినిమాల మీద పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని చాలామంది అభిమానులు మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు.