Darshan.. ప్రముఖ కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రేయసి కోసం ఈయన హంతకుడిగా మారి జైలు పాలు అవడంతో ఆయన భార్య, పిల్లలు ఒంటరి అయిపోయారు. గత నాలుగు నెలలుగా దర్శన్ జైలులో ఉంటున్నారు. రేణుక స్వామి హత్యకు సంబంధించి దాదాపు 3,991 పేజీలతో కూడిన చార్జీ షీటును పోలీసులు దాఖలు చేయగా.. ఈ క్రమంలోనే దర్శన్ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా పోలీసులు ఈ చార్జి షీట్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
పవిత్ర వల్లే మేము విడిపోయాం – విజయ లక్ష్మి
ముఖ్యంగా దర్శన్ , పవిత్ర (Pavitra Gowda) ల గురించి విజయలక్ష్మి సంచలన విషయాలు బయటపెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక పేరు సొంతం చేసుకున్న దర్శన్ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. 2000వ సంవత్సరంలో విజయలక్ష్మిని దర్శన్ వివాహం చేసుకున్నారు. అయితే పలు విభేదాలు వచ్చిన కారణంగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు.కానీ విడాకులు తీసుకోలేదు. ఈ క్రమంలోనే హీరోయిన్ పవిత్ర గౌడ వారి జీవితంలో అడుగుపెట్టడంతో భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగిపోయింది.
అభిమానిని హత్య చేసిన దర్శన్..
ఇక దర్శన్ , పవిత్ర గౌడతో దాదాపు పది సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై వీరి బంధాన్ని తప్పుపడుతూ దర్శన్ అభిమాని రేణుక స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడిని దాదాపు 18 మంది గ్యాంగ్ తో కలిపి దర్శన్, పవిత్ర గౌడ అత్యంత దారుణంగా హతమార్చారు. ఇప్పుడు హత్య కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఇందులో భాగంగానే హత్య కేసులో చిక్కుకున్న తన భర్త దర్శన్ అలాగే పవిత్ర రిలేషన్ గురించి విజయలక్ష్మి చార్జిషీటులో ఇలా చెప్పుకొచ్చారు.
ప్రైవేట్ ఫోటోలు చూపించి పవిత్ర, దర్శన్ ను బెదిరించింది..
దర్శన్ తన భర్త అని తనకు సపోర్ట్ చేయడం లేదు కానీ స్వతహాగా ఆయన మంచి మనిషి, దర్శన్ ను పవిత్ర గౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసింది అంటూ విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు ఆ విషయాన్ని పోలీసులు ఛార్జిషీటులో తెలిపారు. 2014లో పవిత్ర గౌడతో దర్శన్ ప్రేమ, సహజీవనం మొదలైందని, అదే విషయంపై తాను దర్శన్ తో గొడవ పడినట్లు విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా పవిత్ర గౌడ దర్శన్ తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి, ఆయనను బెదిరించిందని, దర్శన్ నుంచి ఇల్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు ఆమె తీసుకుందని విజయలక్ష్మి ఆరోపించారు. మొత్తానికి అయితే పవిత్ర గౌడ సీక్రెట్ ఫోటోలతో దర్శన్ ను బెదిరించి తన వైపు లాక్కుంది అంటూ విజయలక్ష్మి ఆరోపణలు చేసింది.
ఆమె రానంత వరకు మా జీవితం సజావుగా సాగింది..
ఇకపోతే పవిత్ర గౌడ తమ జీవితంలోకి రానంతవరకు తమ సంసారం సజావుగా సాగిందని తెలిపిన ఈమె.. ఇంకొకవైపు తన భర్త బయటకు రావాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ అస్సాంలో ఉన్న గువాహటిలో ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.