Daavudi Song : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిపేలా తాజాగా దేవర నుంచి రిలీజైన దావూది సాంగ్ భారీ సంఖ్యలో వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తోంది.
ట్రోలింగ్ జరిగినా టాప్ ట్రెండింగ్ లో..
డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం దేవర. 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఎపిక్స్‌లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది ఈ మూవీ. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహా పలు భాషలలో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేవర నుండి తాజాగా రిలీజైన మూడవ సింగిల్ “దావూది” సాంగ్ అయితే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
ఈ పెప్పీ ట్రాక్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అని చెప్పాలి. ఇందులో అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆకట్టుకునే బీట్‌లు, రామజోగయ్య శాస్త్రి రాసిన డైనమిక్ కంపోజిషన్, ఆకర్షణీయమైన సాహిత్యం అదిరిపోయింది. ఈ పాటను తెలుగులో నకాష్ అజీజ్, అకాసా ఎనర్జిటిక్ గా పాడారు. అలాగే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మ్యాజికల్ కెమిస్ట్రీ, అదిరిపోయే స్టెప్స్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక ట్రీట్ అని చెప్పవచ్చు. ఓవైపు ట్రోలింగ్ జరుగుతున్నా రిలీజైన 24 గంటల్లోనే 35 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టింది దావూది సాంగ్. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం.
ట్రోలింగ్ బూస్ట్ ఇస్తోందా ?
కానీ మరోవైపు చూసుకుంటే దావూది పాట కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. హలమతి హాబీబో అనే పాటలాగే దావూది సాంగ్ ఉందని, అంతేకాకుండా డ్యాన్స్ కూడా అచ్చం ఆ పాటలో ఉన్నట్టుగానే ఉందనే విమర్శలు విన్పించాయి. ఈ రెండు సినిమాలకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఆయనపైనే ఎక్కువగా విమర్శలు విన్పిస్తున్నాయి. కానీ ఈ ట్రోలింగే దేవరకు బూస్ట్ ఇస్తున్నట్టుగా అన్పిస్తోంది. చుట్టమల్లె సాంగ్ కు కూడా ఇదే ఇలాగే ట్రోలింగ్ నడిచింది. కానీ ఆ పాట సోషల్ మీడియాతో పాటు మ్యూజిక్ లవర్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు కూడా దావూది సాంగ్ విషయంలో ఇలాగే జరుగుతోంది. ఎంత ట్రోలింగ్ జరిగినా అవే ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. రేపు దేవర మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇదే కంటిన్యూ అయితే మూవీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సాంగ్స్ విషయంలో అయితే ట్రోలింగ్ కారణంగా వచ్చిన రెస్పాన్స్ అదుర్స్. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.