Daavudi Song : మోస్ట్ అవైటింగ్ మూవీ దేవరకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన పాటలపై నెగెటివిటీ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ పాటను కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో దేవరపై ట్రోలింగ్ జరిగింది. తాజాగా రిలీజైన దావూది అనే పాట విషయంలో కూడా దేవర అడ్డంగా దొరికిపోయాడు. మరి ఈ పాటను ఎక్కడ నుంచి కాపీ కొట్టారో తెలుసుకుందాం పదండి.
దావూది కూడా కాపీనే !?
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం దేవరకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేవర నుండి తాజాగా రిలీజైన మూడవ సింగిల్ “దావూది” సాంగ్ పై ట్రోలింగ్ మొదలైంది. ఈ పెప్పీ ట్రాక్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అంటూ మేకర్స్ ఊరించారు. ఇక ఇందులో అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆకట్టుకునే బీట్లు, రామజోగయ్య శాస్త్రి రాసిన డైనమిక్ కంపోజిషన్, ఆకర్షణీయమైన సాహిత్యం బాగానే ఉంది. ఈ పాటను తెలుగులో నకాష్ అజీజ్, అకాసా ఎనర్జిటిక్ గా పాడారు. అలాగే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మ్యాజికల్ కెమిస్ట్రీ, అదిరిపోయే స్టెప్స్ ఒక ట్రీట్ అని చెప్పవచ్చు. ఇదంతా ఎన్టీఆర్ అభిమానుల వెర్షన్.
కానీ మరోవైపు చూసుకుంటే దావూది పాట అలా రిలీజ్ అయిందో లేదో ఇలా ఆ పాటను ఎక్కడ కాపీ కొట్టారో పట్టేశారు నెటిజన్లు. అంతేకాదు సోషల్ మీడియాలో పెట్టి దేవర టీంను ఓ రేంజ్ లో ఏకీపారేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే దావూది సాంగ్ అచ్చం హలమతి హాబీబో అనే పాటలాగే ఉందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇది తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్. పాట మాత్రమే కాదు ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా ఆ పాటలో విజయ్ చేసినట్టే ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకేముంది హలమతి సాంగ్ కు దావూది కాపీలా ఉంది అనే కామెంట్స్ రావడానికి కారణం అనిరుధ్ అంటున్నారు. ఇంతకుముందు రిలీజైన చూట్టమల్లే సాంగ్ కూడా కాపీనే అనే ట్రోలింగ్ నడిచింది.
దేవర చేతుల్లో అనిరుధ్ ఫ్యూచర్
దేవర 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఎపిక్స్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహా బహుళ భాషలలో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇలాంటి పాన్ ఇండియా మూవీ సాంగ్స్ కాపీ అంటూ విమర్శలు రావడం అనేది ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే అనిరుధ్ ఫ్యూచర్ ఇప్పుడు దేవర రిజల్ట్ పైనే ఆధారపడి ఉందన్నమాట.