The GOAT : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హిట్ ఫ్లాప్ సినిమాలతో పనిలేకుండా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా ది గోట్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 5 న థియేటర్లలోకి వచ్చింది. యావరేజ్ టాక్ ను అందుకుంది. కలెక్షన్స్ మాత్రం తగ్గట్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక ఇన్ని రోజులకు ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కాఫీ అంటూ ఓ వార్త నెట్టింట ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది. ఓ ఇంగ్లిష్ సినిమా సీన్ ను దింపేసారని వార్తలు చక్కర్లు కొడుతుంది.
“ది గోట్” సినిమాలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించాడు. తండ్రీ కొడుకులుగా నటించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు ( Venkat Prabu ) దర్శకత్వం వహించాడు. ది గోట్లో విజయ్ యాక్టింగ్, డ్యాన్సులు బాగున్నా… స్టోరీ, విజయ్ లుక్ విషయంలో దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఔట్‌డేటెడ్ స్టోరీతో వెంకట్ ప్రభు ఈ మూవీని తెరకెక్కించినట్లు ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తోన్నారు. తాజాగా ఓ ఇంగ్లిష్ సినిమాను మొత్తం దింపేసి గొర్రెలను చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2018 లో రిలీజ్ అయిన ఫైనల్ స్కోర్ అనే సినిమా క్లైమాక్స్ సీన్ ను ఇందులో మొత్తం దింపేశారు. గోట్ మూవీలో ధోని సిక్స్ కొట్టే టైంలో… బైక్ జంప్ సీన్ ఉంటుంది. ఇక్కడ గోల్ కొట్టే టైంలో బైక్ జంప్ సీన్ ఉంది. గోట్ మూవీలో బైక్ రూఫ్ పైన ఉన్నప్పుడు కామెంట్రీ ఉంటుంది..
ఏంటి ఇది నిజమా అని ఫ్యాన్స్ తెగ కోపంతో రగిలిపోతున్నారు. ఇక నెటిజన్స్ క్లైమాక్స్ మొత్తం కాపీనేనా…? మీ గోట్‌తో మమ్మల్ని గొర్రెలను చేశారు కదరా.. అంటూ గోట్ టీమ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీనిపై గోట్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇక కలెక్షన్ మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 400 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పటిలో కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగేట్లు ఉంది. ఈ కాపీ విషయం మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..
#GOAT Climax
Lifted from Final Score (2018) pic.twitter.com/sAsOGp6MG1
— Trollywood (@TrollywoodOffl) September 8, 2024