Chiranjeevi: సెట్ లో స్టార్ హీరోయిన్ గొడవ.. ఏమైందంటే..?

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన అద్భుతమైన నటనతో.. పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాదు సేవా కార్యక్రమాలతో కొన్ని వేల మంది ప్రజలను ఆదుకుంటూ ఉంటారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చాలా మంది హీరోయిన్ లతో పలు సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో చాలామందికి ఎఫైర్ రూమర్స్ అంటగట్టారు కూడా.. అయితే ఇదంతా ఇలా ఉండగా ఒక హీరోయిన్ చిరంజీవిపై అలిగి వెళ్లినట్టు… పైగా సెట్ నుంచి వెళ్ళిపోవడం.. ఫలితంగా చిరంజీవి బ్రతిమలాడడం అన్నీ జరిగిపోయాయి.. ఈ విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవితో గొడవ.. సెట్ నుంచీ నగ్మా వెళ్ళే ప్రయత్నం..

Chiranjeevi: Star heroine fight on the set.. what happened..?
Chiranjeevi: Star heroine fight on the set.. what happened..?

ఇక అసలు విషయంలోకెళితే.. ప్రముఖ హీరోయిన్ నగ్మ చిరంజీవి తో కలిసి.. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు లాంటి హిట్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.. ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎంత రక్త కట్టిస్తాయో.. డాన్స్ విషయంలో కూడా హీరోకి దీటుగా వేసేది నగ్మా.. అయితే రిక్షావోడు సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, నగ్మా మధ్య వివాదం జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ సమయంలో చిన్నపాటి గొడవ చిరంజీవితో కలిగిందట. దీంతో నగ్మా అలిగి అక్కడ నుంచి అప్పటికప్పుడు రామానాయుడు స్టూడియో నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిందట. అయితే అలా వెళ్ళిపోయే సమయంలో దర్శక నిర్మాతలు నగ్మాను ఎంత బ్రతిమలాడినా మాట వినిపించుకోలేదట..

చిరు ఆ మాట చెప్పి ఒప్పించారు..

దీంతో లాభం లేదు అనుకున్న చిరంజీవి కూడా.. ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె వినలేదు.. చివరికి రాజీకొచ్చి నవ్వుకుంటూ షూటింగ్లో జాయిన్ అయిందట.. మరి అంత మంది చెప్పినా వినని నగ్మా.. చిరంజీవి ఒక్క మాట చెప్పేసరికి ఆమె ఒప్పుకుందట.. ఈ విషయం మీడియాలో పెద్ద వైరల్ అయింది..ఇంతకూ అలిగిన నగ్మా కు చిరంజీవి ఏం చెప్పి ఒప్పించారు? అన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు..

- Advertisement -

ఏంటా మాట.. ఇప్పటికీ మిస్టరీనే..!

ఒకవేళ తెలిసినా ఆ సినిమా దర్శక నిర్మాతలలో ఎవరికైనా తెలిసే అవకాశం ఉంది.. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించలేదు.. ప్రస్తుతం చిరంజీవి సినిమా లలో యాక్టివ్ గా ఉన్నా.. నగ్మా మాత్రం రిటైర్మెంట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోకి వస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే నగ్మాను చిరంజీవి ఏం చెప్పి ఒప్పించారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మిగిలిందని చెప్పవచ్చు.

చిరంజీవి కెరియర్..

చిరంజీవి విషయానికి వస్తే.. సినిమాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు.. అయితే పార్టీను ఎక్కువ కాలం ముందుకు తీసుకెళ్లలేక.. కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి రీయంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్ లతో సరిపెట్టుకుంటున్నారు.. కానీ సరైన సూపర్ హిట్ మాత్రం ఇంకా ఆయన ఖాతాలో వచ్చి చేరలేదు.. ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు