GreatestOfAllTime : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా ఈరోజు, అనగా సెప్టెంబర్ 5న రిలీజ్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కావడం జరిగింది. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూడడం జరిగింది. ఇక అర్ధరాత్రి నుండే థియేటర్ల వద్ద విజయ్ అభిమానుల సందడి మొదలైంది. ముఖ్యంగా తమిళనాట విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో గోట్ (GratestOfAllTime) మ్యానియాతో ఊగిపోతున్నారు. అయితే గోట్ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వినిపిస్తుంది. ఇదిలా ఉండగా గొట్ సినిమా మాత్రం విజయ్ ఫ్యాన్స్ తో పాటు, మరో స్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్ గా నిలుస్తుంది.
అదిరిపోయిన కెప్టెన్ ఎంట్రీ..
ఇదిలా ఉండగా గోట్ సినిమాకు మిక్సడ్ రెస్పాన్స్ వచ్చినా టాక్ తో సంబంధం లేకుండా విజయ్ ఫ్యాన్స్ ఎగబడిపోతుండగా, ఓ సీనియర్ స్టార్ ఫ్యాన్స్ కూడా గోట్ కోసం థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఆ స్టార్ ఎవరో కాదు తమిళనాట అభిమానులచేత కెప్టెన్ (Captain) అని గౌరవంగా పిలిపించుకునే లెజెండరీ స్టార్ “విజయ్ కాంత్” (Vijaykanth). అవును.. గోట్ సినిమాలో కీలకమైన సీన్ లో కెప్టెన్ విజయ్ కాంత్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఉన్నది కాసేపైనా విజయ్ కాంత్ అభిమానులు, అలాగే దళపతి విజయ్ ఫ్యాన్స్ అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. కెప్టెన్ కి ఇది పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
AI టెక్నాలజీ తో కెప్టెన్ ని తీసుకొచ్చిన మేకర్స్..
అయితే లాస్ట్ ఇయర్ విజయ్ కాంత్ చనిపోయిన విషయం తెలిసిందే. మరి ఆయన్ని గొట్ లో ఎలా నటింపచేశారని సందేహం రావచ్చు. అయితే సినిమాలో విజయ్ కాంత్ ని నటింపచేయాలని మేకర్స్ అనుకున్నా, అప్పటికే ఆయన చనిపోగా, AI టెక్నాలజీతో కెప్టెన్ విజయ్ కాంత్ ని మళ్ళీ సృష్టించారు. పైగా గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోకుండా మేకర్స్ బాగానే కష్టపడ్డారు. అయితే డబ్బింగ్ ని మిమిక్రి చేయించారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా విజయ్ కాంత్ చనిపోయినపుడు దళపతి విజయ్ చిత్ర యూనిట్ తో కెప్టెన్ విజయ్ కాంత్ ఫ్యామిలీని కలిసి సినిమాలో ఆయన అప్పీరెన్స్ గురించి వివరించడం జరిగింది. ఏది ఏమైనా కెప్టెన్ విజయ్ కాంత్ ని మళ్ళీ ఈ రకంగా వెండితెరపై చూపించినందుకు విజయ్ కాంత్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ఇక గొట్ సినిమాను వెంకట్ ప్రభు (Venkat prabhu) డైరెక్ట్ చేయగా థియేటర్లలో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది.