ThalapathyVijay : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడు లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్ అని అందరూ అంటుంటారు. అయితే తెలుగులో మాత్రం ఈ మధ్యనే మంచి ఆదరణ దక్కించుకుంటున్నాడు. విజయ్ (ThalapathyVijay) నటించిన తుపాకీ, విజిల్, రీసెంట్ గా లియో వంటి సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా దళపతి విజయ్ రీసెంట్ గా ఒక రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు “తమిళ వెట్రి కళగం” (Tamil Vetri Kalagam) అనే పేరును పెట్టడం జరిగింది. ఇక రీసెంట్ గానే పార్టీ జెండాని కూడా ఆవిష్కరించిన విజయ్ పై అప్పుడే రాజకీయంగా కాంట్రావర్సీ మొదలైంది.
పార్టీ పెట్టి పదిరోజులు కాలేదు.. అప్పుడేనా?
దళపతి విజయ్ రీసెంట్ గా తన పార్టీ జెండాని ఆగష్టు 22న ఆవిష్కరించాడు. అయితే విజయ్ పార్టీ జెండాపై వ్యతిరేకంగా అప్పుడే జాతీయ స్థాయిలో రచ్చ మొదలైంది. దళపతి విజయ్ పార్టీ (TVK) “తమిళ వెట్రి కళగం” పార్టీ జెండా పై రెండు ఏనుగుల గుర్తు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ జెండా లో ‘ఏనుగు గుర్తు’ తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని… పార్టీ జెండాలో తమ ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీ అయిన ‘బహుజన సమాజ్ వాద్ పార్టీ’ (BSP) ఆరిపోయించింది. అంతే కాదు తమ గుర్తును ఉపయోగిస్తున్నారని వెంటనే తొలగించాలని ఈసీకి (ఎన్నికల కమిషన్) ఫిర్యాదు చేశారు బహుశా సమాజ్ పార్టీ వారు.
అప్పుడే నెట్టింట రచ్చ..
ఇక ఈ వివాదంపై ప్రముఖ పార్టీ నేతలకు విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. పార్టీ గుర్తులు కొన్ని పోలి ఉన్నంత మాత్రాన ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకరీసెంట్ గా జెండా ఆవిష్కరించిన విజయ్ అప్పట్లో.. తన పార్టీ గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ.. గెలిచినా ఓడిన ఒంటరిగానే ప్రయాణిస్తాను. నా ఫ్యాన్స్ తో ఇంకో పార్టీ జెండాను మోయనవ్వను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ బాగా వైరల్ అయింది. ఇదిలా ఉండగా విజయ్ నటించిన గోట్ (Goat) సినిమా వచ్చేవారం సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.