BrahmaAnandam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రత్యేకమైన బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ పైన రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka) సినిమాలోని నిర్మిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు దేనికి అదే ప్రత్యేకమని చెప్పాలి. మళ్లీ రావా అనే సినిమాతో గౌతం తిన్ననూరి(Gautham Tinnanuri) ఈ బ్యానర్ తోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత జెర్సీ(Jersey) లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను తెరకెక్కించాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent Sai Srinivasa athreya) అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)ఇదే బ్యానర్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా ఇదే బ్యానర్ నుంచి మసూద ఒక సినిమా వచ్చింది. ఈ హర్రర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే వరుస హిట్ సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో రాబోతున్న సినిమా బ్రహ్మానందం.
పద్మశ్రీ బ్రహ్మానందం, రాజ గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియ వడ్లమని, రాజీవ్ కనకాల వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శాండిల్య పీసపాటి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నేడు రక్షాబంధన్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్ లోని రాజా గౌతమ్ లోని ఒక కామెడీ టైమింగ్ మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. అలానే వెన్నెల కిషోర్(Vennela Kishor)BrahmaAnandam పాత్రకు కూడా మంచి స్కోప్ ఉండేలా అనిపిస్తుంది. అలానే ఈ వీడియోలో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫన్నీగా ఉంది. ఇంకా బ్రహ్మానందం గారి ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.