Boyapati Srinu: భద్ర సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బోయపాటి శ్రీను. భద్ర సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బోయపాటి శ్రీను కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమా అంటే సింహా అని చెప్పాలి. మొదటిసారి నందమూరి బాలకృష్ణ తో పనిచేసే అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య బాబుకి అందించారు. అదే జోష్ లో ఎన్టీఆర్ పిలిచి దమ్ము అనే సినిమాకి అవకాశం కల్పించాడు అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటేనే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. ఇప్పటివరకు మీరు కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. నాలుగో సినిమా కూడా రావడానికి సిద్ధమవుతుంది. బోయపాటి శ్రీను తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా సింహ(Simha), లెజెండ్(Legend), అఖండ(Akhanda) సినిమాలు ప్రత్యేకమని చెప్పాలి. బాలకృష్ణని అభిమానులు ఎలా చూడాలని ఆశపడతారు అలానే చూపిస్తారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేశారంటే ఇద్దరికీ సక్సెస్ వస్తుంది.
ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాలయ్య 50 సంవత్సరాలను కంప్లీట్ చేసుకున్నారు. 50 సంవత్సరాలలో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలను చేశారు ఈ తరుణంలో బాలయ్య సినీ ప్రస్థానాన్ని గురించి ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడారు.తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాల కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి.
మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఎక్కడా ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన వ్యక్తి ఎన్టీఆర్, అటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారికోసం ఖచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది.