Bommarillu: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇకపోతే దిల్ అనే సినిమాతో నిర్మాతగా మారారు దిల్(Dil) రాజు. ఆ సినిమాకి చాలామంది ఇప్పుడున్న దర్శకులు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్ పైన దిల్ రాజు చాలామంది దర్శకుల్ని పరిచయం చేస్తూ అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వచ్చిన కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ఎక్కువ శాతం ఈ బ్యానర్ నుంచి పరిచయమైన వాళ్లే అని చెప్పాలి.
ఈ బ్యానర్ లో దిల్, ఆర్య(Aarya), బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం(Kottha bangaru Lokam) వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకం. కానీ బొమ్మరిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పాలి. ఒక తండ్రి కొడుకు అలానే ఒక అమ్మాయి ఈ ముక్కోనపు ప్రేమ కథని చాలా అద్భుతంగా డీల్ చేశాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు భాస్కర్. సిద్ధార్థ జెనీలియా కలిసి నటించిన ఈ సినిమా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా కథ, కథనంతో పాటు అందరికీ బాగా కనెక్ట్ అయిన అంశం ఈ సినిమాలో క్యారెక్టర్రైజేషన్స్. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఇంస్టాగ్రామ్ రీల్స్ రెడీ
అలానే అబ్బురి రవి రాసిన మాటలు ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా వినిపిస్తాయి. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతున్న తరుణంలో బొమ్మరిల్లు సినిమాను కూడా మరోసారి సెప్టెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్. రీ రిలీజ్ సినిమాలకు విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మళ్లీ థియేటర్లో చూస్తూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది సూపర్ హిట్స్ పాటలను రీ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ గా వదులుతున్నారు. ఇక బొమ్మరిల్లు సినిమాలో పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఫ్యామిలీతో పాటు చూసే అవకాశం ఉంది
ఇప్పటికీ కూడా ఈ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమాను రీ రిలీజ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మళ్లీ థియేటర్లు కుదిరితే కప్పు కాఫీ అని డైలాగును కూడా రీ క్రియేట్ చేయబోతున్నారు. ఇకపోతే మహేష్ బాబు నటించిన మురారి సినిమా రి రిలీజ్ లో అక్కడక్కడ పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి చాలా మంది ఫ్యామిలీతో కూడా హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి. ఏదేమైనా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఇప్పుడు సినిమాలేవి లేకపోయినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బొమ్మరిల్లు సినిమాను మరోసారి రిలీజ్ చేసి లాభాలు అందుకోనున్నారు.