Kangana Ranaut : మాములుగా సెలెబ్రేటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు సక్సెస్ అయితే ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇంకొందరు సెలబ్రిటీలు భూములు, స్థలాలు వంటివాటిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆస్తులను కూడబెట్టుకోవడం చూస్తుంటాము. ఇలాంటి సమయంలో ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఆస్తులను అమ్మేందుకు సిద్ధంగా ఉందని గత కొన్ని రోజులు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తుంది. కోట్ల విలువ చేసే ఇంటిని అమ్మేసింది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut )..
సినిమాలే కాదు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది కదా మరి ఆస్తులను ఎందుకు అమ్ముతుంది అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ ఇది నిజం. కంగనాకు ముంబైలో ఖరీదైన ఇల్లు ఉంది. ఆ ఇంటిని అమ్మాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఇంటి విషయంలో అనేక స్టార్లు కంగనా సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దాంతో ముంబై నుంచి మకాం మార్చేసింది. ఇక తాజాగా ఆ ఇంటిని అమ్మేసింది. ముంబైలోని బాంద్రా బంగ్లాను 2017 లో కొనుగోలు చేసింది. అప్పటిలో రూ. 20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు దానికి డబుల్ రేటుకు అంటే రూ. 32 కోట్లకు అమ్మేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ ఆ ఇంటిని కొనుగోలు చేసింది.
ఇక అమ్మకంలో రూ 1.92 కోట్ల స్టాంప్ డ్యూటీ ఉంది. 2020లో, BMC బంగ్లాలోని అక్రమ భాగాలను కూల్చివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని కంగనా ఆరోపించింది.. అప్పటిలో ఇది రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించింది. చివరకు 2023 మేలో కంగనాపై చేసిన అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది. ఇక మొత్తానికి ఇంటి అమ్మకంపై వస్తున్న వార్తల విషయంలో కంగనా స్పందించలేదు. మొత్తానికి ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రెండు పడవల మీద కంగనా నడుస్తుంది. రాజకీయాల్లో ఎంపీగా భాద్యతలు తీసుకుంది. మరోవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోయిన్ గా వరుస సినిమాలను చెయ్యడం మాత్రమే కాదు . తానే స్వయంగా తన సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం బయోపిక్ లలో నటిస్తుంది. రాజకీయ నేతల బయోపిక్ లతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడిగా ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. ఆ సినిమా యావరేజ్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో తర్వాత సినిమాలు చెయ్యలేదు. ఇప్పుడు కేవలం బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంది.